Home   »  క్రీడలు   »   Ranji Trophy winner | రంజీ ట్రోఫీ విజేత ముంబై..!

Ranji Trophy winner | రంజీ ట్రోఫీ విజేత ముంబై..!

schedule raju
Ranji Trophy winner Mumbai

Ranji Trophy winner | అజింక్య రహానే నేతృత్వంలోని ముంబై రంజీ ట్రోఫీని (Ranji Trophy winner) రికార్డు స్థాయిలో 42వ సారి గెలుచుకుంది. విదర్భతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై 169 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే స్టేడియంలో తొలి ఇన్నింగ్సులో ముంబై 224 రన్స్ చేయగా విదర్భ 105 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్సులో ముంబై 418 రన్స్ చేయగా విదర్భ 368 రన్స్‌కే పరిమితమైంది.

విదర్భ తరుపున సెంచరీ బాదిన అక్షయ్ వాడ్కర్

విదర్భ తరుపున అద్భుత సెంచరీ చేసిన అక్షయ్ వాడ్కర్ (102) పోరాటం వృథా అయింది. హర్ష్ దూబే 65 పరుగులు చేశాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కానీ ఈ వికెట్ పతనంతో, విదర్భ 14 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లను కోల్పోయి ఒక్కసారిగా కుప్పకూలింది. ముంబై తరఫున తనుష్ కొటియన్ నాలుగు వికెట్లు, ముషీర్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే రెండేసి వికెట్లు తీశారు.

సంక్షిప్త స్కోర్ జాబితా:

  • ముంబై తొలి ఇన్నింగ్స్ 224 ఆలౌట్ (తుషార్ 75, యష్ ఠాకూర్ 54/3)
  • విదర్భ తొలి ఇన్నింగ్స్‌ 105 ఆలౌట్‌ (యష్ రాథోడ్ 27, తనుష్ కొటియన్ 7/3)
  • ముంబై రెండో ఇన్నింగ్స్ 418 ఆలౌట్ (ముషీర్ ఖాన్ 136, శ్రేయాస్ 95, రహానే 73, ములానీ 50*, హర్ష్ దూబే 144/5)
  • విదర్భ రెండో ఇన్నింగ్స్‌ 368కి ఆలౌట్‌ (వాడ్కర్‌ 102, కొటియన్‌ 95/4)

Also Read: ప్రపంచ రికార్డు సృష్టించిన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్..!