Home   »  క్రీడలు   »   Semifinal | బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన భారత్

Semifinal | బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన భారత్

schedule mahesh

ASIAN GAMES 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో సెమీఫైనల్ (Semifinal) మ్యాచ్లో పసికూన బంగ్లాదేశ్‌పై భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

Asia games Semifinals

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు బంగ్లాదేశ్‌ను జట్టును నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగుల స్వల్ప స్కోర్‌కు కట్టడి చేసింది. భారత బౌలర్లు సాయి కిషోర్ 3/12తో ముగించగా, వాషింగ్టన్ సుందర్ 2/15తో ఆకట్టుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీం ఇండియా గత మ్యాచ్ సెంచరీ హీరో యశస్వి జైశ్వాల్ డక్ అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన హైద్రాబాద్ స్టార్ ఆటగాడు తిలక్ వర్మ26 బంతుల్లో 55పరుగులు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 40 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. కేవలం 9.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయం ద్వారా భారత్ ఆసియా క్రీడలలో ఫైనల్ దూసుకెళ్లింది.

ఇవాళ మరో సెమీఫైనల్లో (Semifinal) పాకిస్థాన్ జట్టు నెదర్లాండ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిస్తే ఆసియా గేమ్స్ ఫైనల్లో మరోసారి దాయాదుల పోరు చూడవచ్చు.