Home   »  క్రీడలు   »   కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా తిరిగొచ్చిన శ్రేయస్ అయ్యర్

కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా తిరిగొచ్చిన శ్రేయస్ అయ్యర్

schedule mahesh

IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టీం గురువారం (డిసెంబర్ 14) కెప్టెన్ పేరును ప్రకటించింది. 2022లో కోల్‌కతా కెప్టెన్ అయిన తర్వాత గాయంతో ఆ ఏడాది దూరమైన శ్రేయస్ అయ్యర్ మరోసారి IPL 2023లో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. నితీష్ రానా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

Kolkata Knight Riders

2023 IPL సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచిన Kolkata Knight Riders

నితీష్ రాణా కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) 2023లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. 2023 సీజన్‌లో KKR ఏడో స్థానంలో నిలిచింది. రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లు మెరిసినా శ్రేయస్ అయ్యర్ లేని లోటు కొట్టచ్చినట్టు కనపడింది. అయితే ఈ ఏడాది ఆసియాకప్‌లో గాయం నుండి కోలుకుని భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ టాప్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

2024 IPL సీజన్‌లో KKR కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామకం

దింతో వచ్చే సీజన్‌లో మరోసారి అతడికే కెప్టెన్సీ అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు KKR సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్‌లోనూ ఆడిన శ్రేయస్ అయ్యర్ T20 ఫార్మాట్‌లోనూ చెలరేగిపోయాడు. గాయం కారణంగా అయ్యర్ ఐపిఎల్ 2023 నుండి వైదొలిగాడు.

శ్రేయస్ అయ్యర్ తిరిగి KKR కెప్టెన్‌గా రావడం ఫై హర్షం వ్యక్తం చేసిన KKR మేనెజ్మెంట్

అయ్యర్ కెప్టెన్‌గా తిరిగి రావడం సంతోషంగా ఉందని, గాయం నుండి కోలుకుని ఫామ్‌లోకి రావడానికి అతను పడిన శ్రమ అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని వెంకీ చెప్పాడు. తన కెప్టెన్సీని శ్రేయస్‌కు అప్పగించేందుకు అంగీకరించినందుకు నితీష్ రానాకు కృతజ్ఞతలు తెలిపాడు. K.K.R జట్టు ప్రయోజనాల కోసం శ్రేయస్‌కు వైస్ కెప్టెన్‌గా అన్ని విధాలుగా సహకరిస్తానని నితీశ్ చెప్పాడు. తిరిగి కెప్టెన్సీలోకి రావడంపై శ్రేయస్ అయ్యర్ స్పందించాడు.తాను లేని సమయంలో జట్టు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాడని నితీశ్ ను కొనియాడాడు.