Home   »  క్రీడలు   »   పద్మ శ్రీ అవార్డు అందుకోనున్న క్రీడా దిగ్గజాలు వీరే..!

పద్మ శ్రీ అవార్డు అందుకోనున్న క్రీడా దిగ్గజాలు వీరే..!

schedule mahesh

Padma Shri Award | భారతదేశపు అత్యున్నత పురస్కారాలలో నాలుగో అవార్డు అయిన పద్మశ్రీ అవార్డు ఏడుగురు క్రీడాకారులకు లభించింది. ఈ జాబితాలో బ్యాడ్మింటన్ దిగ్గజం రోహన్ బోపన్న, స్క్వాష్ క్రీడాకారిణి జ్యోష్న చిన్నప్ప వున్నారు.

sports-giants-who-received-the-padma-shri-!

Padma Shri Award | కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో క్రీడా రంగానికి చెందిన పలువురు అవార్డులు అందుకున్నారు. భారతదేశపు నాల్గవ అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీ అవార్డు ఏడుగురు క్రీడాకారులకు లభించింది. ఈ జాబితాలో బ్యాడ్మింటన్ దిగ్గజం రోహన్ బోపన్న, స్క్వాష్ క్రీడాకారిణి జ్యోష్న చిన్నప్ప వున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో వరుస విజయాలతో రోహన్ బోపన్న ఫైనల్ చేరి ATP ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తాజాగా ఈ కర్ణాటక ఆటగాడిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించనుంది.

Padma Shri అవార్డు అందుకోనున్న ఏడుగురు క్రీడాకారులు

పద్మశ్రీ అవార్డులు సాధించినవారిలో రోహన్ బోపన్నతో పాటు ఇటీవల స్క్వాష్‌లో ఆసియా క్రీడల్లో పతక విజేత జ్యోత్స్న చిన్నప్ప, పారా స్విమ్మర్ సత్యేంద్ర సింగ్ లోహియా, ఆర్చర్ పూర్ణిమ మహతో, మాజీ హాకీ ప్లేయర్ హర్బిందర్ సింగ్ కూడా పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న క్రీడాకారుల జాబితా.

– రోహన్‌ బోపన్న (బ్యాడ్మింటన్‌ – కర్నాటక)
– జ్యోత్స్న చిన్నప్ప (స్క్వాష్‌ – తమిళనాడు)
– ఉదయ్‌ విశ్వనాథ దేశ్‌పాండే (మల్లకంభ్‌ కోచ్‌ – మహారాష్ట్ర)
– గౌరవ్‌ ఖన్నా (పారా బ్యాడ్మింటన్‌ కోచ్‌ – ఉత్తరప్రదేశ్‌)
– సత్యేంద్ర సింగ్‌ లోహియా (పారా స్విమ్మర్‌ – మధ్యప్రదేశ్‌)
– పూర్ణిమా మహాతో (ఆర్చర్‌ – జార్ఖండ్‌)– హర్బిందర్‌ సింగ్‌ (మాజీ హాకీ ప్లేయర్‌ – ఢిల్లీ)

Also Read | అండర్‌-19 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ పై భారత్ ఘన విజయం