Home   »  క్రీడలు   »   గుజరాత్ టైటాన్స్‌కు గుడ్ బై చెప్పనున్న స్టార్ బౌలర్..?

గుజరాత్ టైటాన్స్‌కు గుడ్ బై చెప్పనున్న స్టార్ బౌలర్..?

schedule mahesh

Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (Indian Premier League)కి ముందు, గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు వరుస షాక్‌లను ఎదుర్కొంటోంది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే జట్టును వీడి ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు.

Gujarat Titans

Gujarat Titans స్టార్ బౌలర్ మహ్మద్ షమీని సంప్రదించిన ఓ ఫ్రాంచైజీ

తాజాగా గుజరాత్ టైటాన్స్ కు మరో షాక్ తగిలేలా కనిపిస్తుంది. ఆ జట్టు స్టార్ బౌలర్ మహ్మద్ షమీని ఓ ఫ్రాంచైజీ సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కల్నల్ అరవిందర్ సింగ్ తెలిపారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు.

గుజరాత్ టైటాన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కల్నల్ అరవింద్ సింగ్ మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని ప్రతి ఫ్రాంచైజీకి అగ్రశ్రేణి ఆటగాళ్లను ఎంపిక చేసుకునే హక్కు వుంటుంది. కానీ ఏ ఫ్రాంచైజీ అయినా నేరుగా ట్రేడింగ్ కోసం ఆటగాడిని సంప్రదించినట్లయితే అది తప్పు ఇది సరైన పద్ధతి కాదని, ఈ విధానం పట్ల గుజరాత్ టైటాన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ సంతోషంగా లేదన్నారు.

ఫ్రాంచైజీ నేరుగా షమీని సంప్రదించినట్లు వెల్లడించిన అర్వింద్ సింగ్

BCCI ప్లేయర్ ట్రేడింగ్‌కు సంబంధించి ఇప్పటికే కొన్ని నిబంధనలను రూపొందించారు. మా జట్టు ఆటగాడు షమీ కోసం వచ్చిన ఫ్రాంచైజీ నేరుగా షమీని సంప్రదించినట్లు వెల్లడించిన అర్వింద్ సింగ్, అది ఏ ఫ్రాంఛైజీ అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో మహమ్మద్ షమీని సొంతం చేసుకోవాలని ఏ ఫ్రాంఛైజీ సంప్రదించింది, వచ్చే IPL సీజన్‌లో షమీ జట్టును మారబోతున్నాడా అనే విషయం తెలియాల్సి వుంది.

IPL లో ప్లేయర్లను ట్రేడ్ చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 12

ఇక ఆటగాళ్ల రీటెన్షన్, రిలీజ్‌కు సంబంధించిన గడువు ఇటీవలె ముగిసింది. కానీ ప్లేయర్లను ట్రేడ్ చేసుకునేందుకు మాత్రం డిసెంబర్ 12 వరకు గడువు వుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ గుజరాత్ టైటాన్స్‌లోనే ఉంటాడా, మారతాడా అనేది తేలాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాలి. షమీతో పాటు పలువురు ఇతర ఫ్రాంఛైజీల ఆటగాళ్లు సైతం జట్లు మారే అవకాశం ఉన్నటు తెలుస్తుంది. దీనిపై డిసెంబర్ 12న పూర్తి వివరాలు తెలిసే అవకాశం వుంది.