Home   »  క్రీడలు   »   ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరిన సుమిత్ నాగల్

ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరిన సుమిత్ నాగల్

schedule mahesh

Sumit Nagal | భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి మ్యాచ్ లో గెలుపొందాడు. తొలి రౌండ్‌లో కజకిస్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ బ‌బ్లిక్‌పై విజయం సాధించాడు.

sumith-nagal-reached-the-second-round-australian

తొలి రౌండ్‌లో అలెగ్జాండర్ బబ్లిక్‌పై Sumit Nagal గెలుపు

Sumit Nagal | భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open 2024) తొలి మ్యాచ్ లో విజయం సాధించాడు. కజకిస్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ బబ్లిక్‌పై మొదటి రౌండ్‌లో గెలుపొందాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ నుండి ధాటిగా ఆడిన 31వ ర్యాంక్‌ సుమిత్ నాగల్‌ 6-4, 6-2, 7-6తో సీడెడ్ ఆటగాడు బబ్లిక్‌ ను చిత్తు చేసాడు.

సీడెడ్ ఆటగాడిని ఓడించిన రెండో భారతీయుడిగా నిలిచిన సుమిత్

ఈ విజయంతో మూడేళ్ల తర్వాత సుమిత్ నాగల్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. అంతేకాదు గ్రాండ్‌స్లామ్ చరిత్రలో సీడెడ్ ఆటగాడిని ఓడించిన రెండో భారతీయుడిగా సుమిత్ నిలిచాడు. 1988లో ర‌మేశ్ కృష్ణ‌న్ తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు.ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రమేష్ స్వీడన్‌కు చెందిన మ్యాట్స్ విలాండర్‌ను ఓడించాడు.

రెండో రౌండ్‌లో సుమిత్ నాగల్ తదుపరి మ్యాచ్ చైనాకు చెందిన జున్‌చెంగ్ షాంగ్ మరియు USA యొక్క మెకెంజీ మెక్‌డొనాల్డ్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో ఉంటుంది.

Also Read: రిపబ్లిక్‌ డే రోజు పంజాబ్‌ CMను చంపేస్తామన్న ఖలిస్తానీ టెర్రరిస్ట్