Home   »  క్రీడలు   »   పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సుమిత్‌

పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సుమిత్‌

schedule mahesh

హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ మార్క్‌ దాటి చరిత్ర సృష్టించగా ఇప్పుడు జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లోనూ మనవాళ్లు మెడల్స్‌ వేటలో దూసుకెళ్తున్నారు.

స్వర్ణం తో మెరిసిన సుమిత్‌ (Sumit won gold)

మెన్స్‌ జావెలిన్‌ త్రో-ఎఫ్‌64 విభాగం ఫైనల్‌లో భారత అథ్లెట్లు సుమిత్‌, పుష్పేంద్ర సింగ్‌ పతకాలు గెలుచుకున్నారు. ఫైనల్ రేసులో 73.29 మీటర్ల దూరం బళ్లెం విసిరిన సుమిత్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

కాంస్య పతాకం గెలుచుకున్న పుష్పేంద్ర సింగ్‌

ఇక ఇదేవిభాగంలో 62.06 మీటర్ల దూరం విసిరిన పుష్పేంద్ర సింగ్‌ కాంస్య పతాకం సాధించాడు. శ్రీలంక ఆటగాడు సమిత 62.42 మీటర్లతో సిల్వర్‌ మెడల్‌ను గెలుచుకున్నాడు. కాగా, పారా ఆసియా క్రీడల్లో 36 పతకాల పట్టికలో భారత్‌ ఐదో స్థానంలో వుంది. ఇందులో 10 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి.