Home   »  క్రీడలు   »   అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్..!

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్..!

schedule mahesh

న్యూఢిల్లీ: వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ (Sunil Narine) ఆదివారం అంతర్జాతీయ, లిస్ట్ ఎ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న సూపర్50 కప్ లిస్ట్ A క్రికెట్‌ లీగ్ అతనికి చివరి లీగ్ కానుంది.

2019లో వెస్టిండీస్ తరఫున చివరి T20 మ్యాచ్ ఆడిన నరైన్

35 ఏళ్ల సునీల్ నరైన్ చివరిసారిగా ఆగస్టు 2019లో వెస్టిండీస్ తరఫున T20 మ్యాచ్ ఆడటం జరిగింది. వెస్టిండీస్ జట్టు తరఫున 6 టెస్టులు, 65 ODIలు, 51 T20Iలు ఆడిన నరైన్ మొత్తం 165 అంతర్జాతీయ వికెట్లు తీసుకున్నాడు.

సూపర్50 లీగ్ చివరి టోర్నీ గా ప్రకటించిన Sunil Narine

సునీల్ నరైన్ లిస్ట్ A క్రికెట్ నుండి రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. ప్రస్తుత సూపర్50 లీగ్ అనేది చివరి టోర్నీ గా నరైన్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వైదొలగాలని తన నిర్ణయాన్ని ప్రకటించిన నరైన్ తనకు క్రికెట్ కెరీర్‌లో సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

నేను వెస్టిండీస్‌కు చివరిసారిగా ఆడి నాలుగేళ్లకు పైగా అవుతుందన్నాడు. అయితే ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని నరైన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. వ్యక్తిగతంగా నా కెరీర్‌లో నాకు తిరుగులేని మద్దతునిచ్చిన మరియు వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాలనే నా కలను సాకారం చేయడంలో నాకు సహాయపడిన వ్యక్తులకు నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

అన‌తికాలంలోనే కీల‌క బౌల‌ర్‌గా ఎదిగిన‌ న‌రైన్

అన‌తికాలంలోనే కీల‌క బౌల‌ర్‌గా ఎదిగిన‌ న‌రైన్ 2012లో పొట్టి ప్ర‌పంక‌ప్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించిన విండీస్ జ‌ట్టులో స‌భ్యుడు. గొప్ప స్పిన్న‌ర్ అయిన‌ప్ప‌టికీ అత‌డి బౌలింగ్ యాక్ష‌న్‌ ప‌లుమార్లు వివాదాస్ప‌ద‌మైంది. దాంతో న‌రైన్ 2016 పొట్టి ప్ర‌పంచ క‌ప్‌తో పాటు 2015 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పొట్టి ఫార్మాట్‌లో విజ‌య‌వంతమైన బౌల‌ర్‌గా పేరొంద‌ని న‌రైన్ జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున మాత్రం కొన్ని మ్యాచులే ఆడాడు.

IPLలో న‌రైన్‌కు మెరుగైన రికార్డు

బీసీసీఐ ఏటా నిర్వ‌హించే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో న‌రైన్‌కు మెరుగైన రికార్డు వుంది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా కొన‌సాగిన ఈ విండీస్ ఆల్‌రౌండర్‌ ఇప్ప‌టివ‌ర‌కూ 162 మ్యాచ్‌లు ఆడాడు. 771 ప‌రుగులు చేయ‌డ‌మే కాకుండా 163 వికెట్లు తీసుకున్నాడు.