Home   »  క్రీడలు   »   నేడు అండర్‌-19 ప్రపంచకప్ సెమీఫైనల్‌.. సఫారీలతో తలపడనున్న భారత్

నేడు అండర్‌-19 ప్రపంచకప్ సెమీఫైనల్‌.. సఫారీలతో తలపడనున్న భారత్

schedule mahesh

U19 semi final | అండర్-19 వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న యంగ్ ఇండియా మంగళవారం జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య సౌతాఫ్రికాతో తలపడనుంది.

today-india-will-face-safaris-the-u19-semi-final

U19 semi final | అండర్-19 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న భారత జట్టు మంగళవారం జరిగే సెమీఫైనల్లో సఫారీ జట్టుతో తలపడనుంది. లీగ్ దశలో ఓడిపోకుండా సూపర్ సిక్స్ చేరిన యంగ్ ఇండియా సూపర్‌ సిక్స్‌లో కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.

టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమిస్ చేరిన భారత్

డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీలోకి ప్రవేశించిన యువ భారత్ బ్యాటింగ్ లో కెప్టెన్ ఉదయ్, అర్షిన్, ముషీర్, సచిన్ దాస్ ఫుల్ ఫామ్ లో ఉండగా, అటు బౌలింగ్ లో సమీ కుమార్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, మురుగన్ అశ్విన్ రాణిస్తున్నారు. మరో సెమిస్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లు ఢీకొనబోతున్నాయి. ఇండియా, దక్షిణాఫ్రికా U19 ప్రపంచ కప్ సెమీఫైనల్ -1 మ్యాచ్ విల్లోమూర్ పార్క్, బెనోనిలో జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 PM ISTకి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ హాట్‌స్టార్ యాప్ మరియు స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది.

భారత్ తుది జట్టు అంచనా : ఉదయ్ సహారన్ (c), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, సచిన్ దాస్, ముషీర్ ఖాన్, అరవెల్లి అవనీష్ రావు (wk), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (wk), ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.

దక్షిణాఫ్రికా తుది జట్టు అంచనా : జువాన్ జేమ్స్ (c), ఎసోసా ఐహెవ్బా, రయీక్ డేనియల్స్, క్వేనా మఫాకా, దేవాన్ మరైస్, న్కోబానీ మోకోనా, రొమాషాన్ పిలే, న్టాండో జుమా (వారం), లువాన్-డ్రే ప్రిటోరియస్ (wk), రిచర్డ్ సెలెట్స్ స్టీవ్ స్టోక్, ఆలివర్ వైట్‌హెడ్.

Also Read | శ్రీలంక చేతిలో చిత్తయిన ఆఫ్ఘనిస్తాన్