Home   »  క్రీడలు   »   వరల్డ్ కప్‌లో మరో సంచలనం…సఫారీలకు షాక్‌ ఇచ్చిన నెదర్లాండ్స్

వరల్డ్ కప్‌లో మరో సంచలనం…సఫారీలకు షాక్‌ ఇచ్చిన నెదర్లాండ్స్

schedule mahesh

వన్డే ప్రపంచకప్ 2023 : లో నెదర్లాండ్స్ జట్టు మరో సంచలనం సృష్టించింది. వరల్డ్ కప్‌ (world cup) మెగా టోర్నీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే సంచలనం సృష్టించిన నెదర్లాండ్స్ జట్టు క్రికెట్లో మేటి జట్టు అయినా దక్షిణాఫ్రికాను ఓడించి మరో సంచలనం నమోదు చేసింది.

దక్షిణాఫ్రికాను చిత్తుగా చేసిన నెదర్లాండ్స్ (world cup)

అది కూడా మామూలుగా కాదు సఫారీలని చిత్తుగా మట్టికరిపించింది. అటు బౌలింగ్‌తోనూ, ఇటు బ్యాటింగ్‌తోనూ నెదర్లాండ్స్ జట్టు అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్)తో తన టీమ్‌ను ముందుండి నడిపించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

వన్డే ప్రపంచకప్‌ (world cup) టోర్నీలో శ్రీలంక, ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్లను ఓడించిన సౌతాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ టీమ్‌ దక్షిణాఫ్రికా జట్టుపై 38 పరుగుల తేడాతో గెలుపొందింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ జట్టుకు ఆరంభం అంతగొప్పగా సాగలేదు. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్‌ జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

సఫారి బౌలర్లు నెదర్లాండ్స్‌ను త్వరగానే ఆలౌట్‌ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే డచ్‌ టీమ్‌ కెప్టెన్‌ స్కాట్ ఎడ్వర్డ్స్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసాడు. అతని అసాధారణ ఆటతీరు తో అందరిని ఆకట్టుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నాసఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు చేసాడు.

నెదర్లాండ్స్ ను ఆదుకున్న కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్

69 బంతుల్లో 78 పరుగులు చేసిన స్కాట్ ఎడ్వర్డ్స్ నాటౌట్ గా వున్నాడు. చివర్లో వాన్‌ డర్‌ మెర్వ్‌ (19 బంతుల్లో 29), ఆర్యన్‌ దత్‌ (9 బంతుల్లో 23) కూడా రాణించడంతో నెదర్లాండ్స్‌ జట్టు చివరి 9 ఓవర్లలో ఏకంగా 109 పరుగులు రాబట్టింది. మొత్తంగా 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు నమోదు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదన తో బరిలోకి దిగిన సఫారీ జట్టు తొలి వికెట్‌గా క్వింటన్‌ డికాక్‌ (16) జట్టు స్కోరు 36 వద్ద ఔటయ్యాడు. ఇక అంతే అప్పటి నుంచి వరుసగా వికెట్లను కోల్పోతూ సౌతాఫ్రికా 39 పరుగులకే రెండు, 42 పరుగులకు మూడు, 44 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.

సౌతాఫ్రికా జట్టు దీంతో నెదర్లాండ్స్ నిర్దేశించిన మోస్తరు లక్ష్యం సైతం సౌతాఫ్రికాకు భారీగా అయిపొయింది. ఆ దశలో హెన్రిచ్‌ క్లసెన్‌ (28), డేవిడ్‌ మిల్లర్‌ (43)తో వీరిద్దరు క్రీజులో కుదురుకోవడంతో సౌతాఫ్రికాకు మళ్లీ విజయం పై ఆశలు చెలరేగాయి.

అయితే జట్టు 89 పరుగుల వద్ద క్లాసెన్‌ ఔట్‌ కావడంతో మళ్లీ కథ అడ్డం తిరిగింది. మార్కో జాన్సన్‌ కూడా త్వరగానే పెవిలియన్‌ చేరడంతో 109 పరుగులకే సౌతాఫ్రికా 6 వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 145 పరుగుల వద్ద డేవిడ్‌ మిల్లర్‌ క్లీన్‌ బౌల్డ్‌ కావడంతో సౌతాఫ్రికా జట్టు ఓటమి అంచుల్లోకి చేరుకుంది.

కేశవ్ మహరాజ్ వీరోచిత పోరాటం

చివర్లో కేశవ్ మహరాజ్ అద్భుతంగా పోరాటం చేసి సౌతాఫ్రికా శిబిరంలో ఆశలు రేకెత్తించి 37 బంతుల్లో 40 (5 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి దూకుడుగా ఆడే క్రమంలో ఎడ్వర్డ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత టెయిలెండర్లు అద్భుతాలేమీ చేయకపోవడంతో సౌతాఫ్రికా 207 పరుగులకే కుప్పకూలింది. 38 పరుగుల తేడాతో సఫారీ జట్టు ఓటమి చవిచూసింది.