Home   »  క్రీడలు   »   Yashasvi Jaiswal |సెంచరీ తో కదం తొక్కిన యశస్వి జైస్వాల్‌…భారత్ విజయం

Yashasvi Jaiswal |సెంచరీ తో కదం తొక్కిన యశస్వి జైస్వాల్‌…భారత్ విజయం

schedule mahesh

Asian Games : చైనాలో జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌లో భాగంగా ఈ రోజు ఇండియా, నేపాల్‌ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది భారత యంగ్ గన్, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) సెంచరీ తో కదం తొక్కాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇండియా

కాగా టాస్‌ గెలిచిన ఇండియా జట్టు కెప్టెన్‌ రతురాజ్‌ గైక్వాడ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. భారత్‌ తరఫున ఈ రోజు తన తోలి ఇంటర్నేషనల్ ప్రారంభ మ్యాచ్ ఆడుతున్న సాయి కిషోర్‌ ఎమోషనల్‌ అయ్యారు. జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో కంటతడి పెట్టుకున్నారు.

యశస్వి జైస్వాల్‌ 49 బంతుల్లో 100 పరుగులు (Yashasvi Jaiswal)

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్‌ డక్ ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) 49 బంతుల్లో 100 పరుగులు సెంచరీ తో కదం తొక్కాడు. మరో బ్యాట్సమెన్ మన హైదరాబాద్ ఆటగాడు తిలక్‌ వర్మ 4 పరుగులతో నిరాశ పరిచాడు .
జితేశ్‌ శర్మ 5పరుగులు, శివం దూబే 25పరుగులు, రింకు సింగ్ 37 పరుగులతో చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నిర్ణిత 20 ఓవర్లలో భారత జట్టు 4 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది.

బౌలింగ్ లో రాణించిన రవి బిష్ణోయ్ 4ఓవర్స్ 24/3వికెట్స్

202 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన నేపాల్ జట్టు ఓపెనర్ కుషాల్ 32 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ అసిఫ్ షేక్ 10 పరుగులు చేసినా ఔటయ్యాడు. మరో బాట్స్మెన్ కుషాల్ మల్ల 22 బంతుల్లో 29, నేపాల్ కెప్టెన్ రోహిత్ పాడెల్ 3పరుగులు, దీపేంద్రసింగ్ ఐరే 15బంతులలో 32 పరుగులు, సుదీప్ జోర 12 బంతుల్లో 29 పరుగులు చేసాడు. నేపాల్ జట్టు 20 ఓవర్లలో 179/9తో పరుగులు చేసింది. దింతో భారత్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్స్, అర్షదీప్ 2, ఆవేశఖాన్ 3, సాయి కిషోర్ 1 వికెట్ తీశారు.