Home   »  క్రీడలు   »   విశాఖ టెస్టులో డబుల్ సెంచ‌రీ చేసిన యశస్వి జైస్వాల్

విశాఖ టెస్టులో డబుల్ సెంచ‌రీ చేసిన యశస్వి జైస్వాల్

schedule mahesh

IND vs ENG 2nd Test | వైజాగ్ టెస్టులో భారత జట్టు యువ ఓపెనర్ Yashaswi Jaiswal (209) డబుల్ సెంచరీ చేశాడు. శనివారం రోజున తొలి సెషన్ ప్రారంభం కాగానే ఓవర్ నైట్ స్కోరు 179 పరుగులతో రెండో రోజు క్రీజులోకి వచ్చిన కాసేటికే య‌శ‌స్వీ జైస్వాల్ తొలి ద్విశ‌త‌కం నమోదు చేసాడు.

yashaswi-jaiswal-double-century-in-2nd-test

IND vs ENG 2nd Test | విశాఖ టెస్టులో యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీ చేశాడు. ఓవర్‌నైట్ స్కోరు 179తో పరుగులతో రెండో రోజు క్రీజులోకి వచ్చిన జైస్వాల్ తొలి సెషన్‌లోనే తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. జైస్వాల్ 191 పరుగుల వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్‌లో విజయవంతమైన సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతినే స్క్వేర్ లెగ్ వద్ద బౌండరీకి తరలించి తన తొలి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

స్వదేశంలో తన తొలి డబుల్‌ సెంచరీ సాధించిన Yashaswi Jaiswal

జైశ్వాల్ స్వదేశంలో తన తొలి డబుల్‌ సెంచరీ సాధించడం విశేషం. అంతేకాక టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత లెఫ్ట్ అండ్ బ్యాట్స్‌మెన్‌గా Yashaswi Jaiswal రికార్డు సృష్టించాడు. అతని కంటే ముందు సౌరభ్ గంగూలీ (239), వినోద్ కాంబ్లీ (227), గౌతమ్ గంభీర్ (206) ఈ ఘనత సాధించారు.

చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన మూడో భారత క్రికెటర్‌

22 ఏళ్ల వయసులో యశస్వి ఈ ఘనత సాధించడం విశేషం. చిన్న వయసులోనే డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా Yashaswi Jaiswal రికార్డు సృష్టించాడు. వినోద్ కాంబ్లీ 21 ఏళ్ల 35 రోజుల వయసులో డబుల్ సెంచరీ చేసాడు. ఆ తర్వాత 1971లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ డబుల్ సెంచరీ సాధించాడు. అప్పుడు కూడా గవాస్కర్ వయసు 21 ఏళ్ల 283 రోజులు కావడం గమనార్హం.

396 పరుగుల వద్ద టీమిండియా ఆల్ఔట్

ఓవ‌ర్‌నైట్ స్టోర్ 336/6 తో రెండో రోజు ఇనింగ్స్ ప్రారభించిన టీమిండియాను అండ‌ర్సన్ దెబ్బతీశాడు. క్రీజులో కుదురుకున్న‌ అశ్విన్(20)ను ఔట్ చేశాడు. దాంతో 364 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ ఏడో వికెట్ నష్టపోయింది. ఆ తరవాత వరుసగా వికెట్లు కోల్పోతూ 112 ఓవ‌ర్ల‌కు టీమిండియా 396 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్, బషీర్, అహ్మద్ లు తలో మూడు వికెట్లు దక్కించుకున్నారు.

Also Read | అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్‌ చేరిన యంగ్‌ ఇండియా