Home   »  టెక్నాలజీ   »   ప్లే స్టోర్‌ నుంచి తొలగించిన 10 యాప్స్‌ ఇవే..!

ప్లే స్టోర్‌ నుంచి తొలగించిన 10 యాప్స్‌ ఇవే..!

schedule raju

Play Store | సెర్చ్ ఇంజిన్ గూగుల్, భారత్ లోని యాప్ డెవలపర్ల మధ్య ప్లే స్టోర్ ఛార్జీల వివాదం మరింత పెరిగింది. కొన్ని కంపెనీలు సర్వీస్ ఛార్జీలు చెల్లించకుండా తమ బిల్లింగ్ నిబంధనలు పదే పదే ఉల్లంఘిస్తున్నాయని గూగుల్ పేర్కొంది. దింతో ప్లేస్టోర్‌ నుంచి 10 భారతీయ కంపెనీల యాప్‌లను గూగుల్‌ తొలగించింది.

10 Indian Apps Removed From Play Store

ప్లేస్టోర్‌ నుంచి 10 భారతీయ కంపెనీల యాప్‌లను గూగుల్‌ తొలగించింది. ALT Balaji, Bharat Matrimony, 99 acres, Naukri, Kuku FM, Quack Quack, Shaadi.com, stage, Truly Madly, STAGE – OTT యాప్ లు సర్వీస్‌ ఫీజు చెల్లించనందుకు ఈ చర్యలు తీసుకున్నామని గూగుల్‌ ప్రకటించింది. ఈ యాప్స్‌ తొలగింపుపై స్టే విధించాలని గతనెల సంబంధిత కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు నిరాకరించింది. దీనిపై ఈనెల 19న మరోసారి విచారణ జరగనుంది.

యాప్‌లకు Play Store సర్వీస్ ఛార్జీలు

డెవలపర్‌లు తమ కస్టమర్‌ల కోసం చేసిన యాప్‌లకు సర్వీస్ ఛార్జీలు చెల్లించాలనే Google నిబంధన చుట్టూ ఈ సమస్య తిరుగుతుంది. గూగుల్‌ ప్లేస్టోర్‌ ఇలాంటి వాటిపై విధానపరమైన చర్యలు తీసుకుంటామని పదే పదే హెచ్చరికలు చేసినప్పటికీ, కొన్ని కంపెనీలు ఈ నిబంధనకి కట్టుబడి ఉండకూడదని నిర్ణయించుకున్నాయి. దింతో హెచ్చరించనట్లుగానే కొన్ని ప్రముఖ యాప్‌లను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించడం ప్రారంభించింది.

మొత్తం భారతదేశానికి సంబంధించిన 10 సంస్థలకు చెందిన యాప్‌లు తమ నిబంధనలు పాటించడంలేదని గూగుల్ ఆరోపిస్తూ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. గూగుల్ యాప్ ఛార్జీల విధానాన్ని ఈ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. కోర్టులో ఈ సంస్థలు పిటిషన్ వేసి, మధ్యంతర ఉత్తర్వులు పొందాయి.

2 లక్షలకు పైగా గూగుల్ Play Storeని ఉపయోగిస్తున్న భారత డెవలపర్లు

అయితే, భారత్ మ్యాట్రిమోనీ యాప్‌ని ఇప్పటి వరకు 5 కోట్ల మంది వాడుతున్నారని తమ బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. గూగుల్ ప్రకారం.. భారత్ లో 2 లక్షలకు పైగా డెవలపర్లు గూగుల్ ప్లేస్టోర్ ని ఉపయోగిస్తున్నారని, వీరంతా తమ పాలసీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. 10 కంపెనీలు మాత్రం కొంత కాలంగా గూగుల్ ప్లే స్టోర్ లో తమ పాలసీకి వ్యతిరేకంగా సర్వీసులకి ఛార్జీలు చెల్లించడం లేదని తెలిపింది.

Also Read: ఆండ్రాయిడ్ గూగుల్ క్యాలెండర్ లో జెమిని AI..!