Home   »  టెక్నాలజీ   »   AI వాయిస్ క్లోనింగ్ స్కామ్.. డబ్బు అడిగితే జాగ్రత్త

AI వాయిస్ క్లోనింగ్ స్కామ్.. డబ్బు అడిగితే జాగ్రత్త

schedule raju

AI voice cloning scam: ఉత్పాదక AI మరియు మెరుగైన మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు కొత్త స్కామ్‌లకు తెరలేపుతున్నాయి. తాజాగా వినియోగదారులకు AI వాయిస్ క్లోనింగ్ ద్వారా మరొక ముప్పు పొంచి ఉంది . మోసగాళ్లు అధునాతన వాయిస్ క్లోనింగ్ పద్ధతుల ద్వారా మీ కుటుంబ సభ్యుల వలె మాట్లాడి మీ దగ్గర డబ్బులు కాయజేయవచ్చు.

AI voice cloning scam Be careful if you ask for money

AI voice cloning scam: ఉత్పాదక AI మరియు మెరుగైన మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు కొత్త స్కామ్‌లకు తెరలేపుతున్నాయి. డీప్‌ఫేక్‌ల ద్వారా ఇప్పుడు స్కామర్‌లు ప్రముఖ సెలబ్రిటీల యొక్క నమ్మదగిన నకిలీ వీడియోలను రూపొందించడానికి AIని ఉపయోగిస్తున్నారు. తాజాగా వినియోగదారులు మరొక ముప్పును ఎదురుకోవాల్సి ఉంది అదే AI వాయిస్ క్లోనింగ్.

AI voice cloning scam

మోసగాళ్లు అధునాతన వాయిస్ క్లోనింగ్ పద్ధతుల ద్వారా మీ కుటుంబ సభ్యుల వలె మాట్లాడవచ్చు. కొద్ది వారాల క్రితమే ఢిల్లీలో ఓ వృద్ధుడు AI వాయిస్ క్లోనింగ్ మోసానికి గురై రూ. 50,000 పోగొట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. తన తమ్ముడి కొడుకు కిడ్నాప్ అయ్యాడని భావించి వృద్ధుడు మోసపోయాడు. స్కామర్, అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తూ, పిల్లల క్లోన్డ్ వాయిస్ రికార్డింగ్‌ను ప్లే చేయడం ద్వారా వృద్ధుడిని తన తమ్ముడి కొడుకు కిడ్నాప్ అయ్యాడని నమ్మేలాచేసాడు. Paytm ద్వారా రూ. 50,000 బదిలీ చేయమని వృద్ధుడిని బెదిరించారు.

అయితే ఆ కిడ్నాప్ అతని దగ్గర నుండి డబ్బు వసూలు చేయడానికి ప్లాన్ చేసిన బూటకమని తరువాత తేలింది. స్కామర్‌లు మరింత నమ్మకంగా మారడానికి కొత్త సాంకేతికతలు మరియు AI వాయిస్ క్లోనింగ్ ని ఉపయోగించారు. అయితే, ఈ తరహా మోసాలు నెమ్మది నెమ్మదిగా బయటపడుతున్నాయి.

ఈ స్కామ్‌ను ఎలా గుర్తించాలి?

  • మీ బ్యాంకు నుండి కాల్ వచ్చినట్లు ఫోన్ వస్తే, వారు మీ డేటా గురించి లేదా డబ్బు గురించి అడిగితే జాగ్రత్త వహించండి. నిజమైన బ్యాంకులు ఎప్పుడూ ఇలాంటి సమాచారాన్ని ఫోన్‌లో అడగవు.
  • మీ బంధువు గానీ, స్నేహితుడు గానీ ప్రమాదంలో ఉన్నారని లేదా ఆస్పత్రిలో ఉన్నారని చెప్పి డబ్బు అడిగితే, వారి నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి నిజమేనా అని నిర్ధారించండి. అపరిచిత నంబర్ లకు డబ్బులు పంపించకండి.
  • ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి వాయిస్‌లో ఏవైనా అసంబద్ధతలు గమనిస్తే జాగ్రత్త వహించండి. ఉదాహరణకు, మీ పేరు తప్పుగా పలకడం, మీకు తెలియని విషయాల గురించి మాట్లాడడం లేదా విచిత్రమైన భాష ఉపయోగించడం చేయండి.

మోసానికి గురైతే ఏం చేయాలి?

  • వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయండి.
  • మీ బ్యాంకుకు తెలియజేసి ఖాతాను block చేయమని చెప్పండి.
  • భారత సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫోన్ చేయండి.

Also Read: QR Code Scam: తస్మాత్‌ జాగ్రత్త… నకిలీ QR కోడ్‌లను సృష్టిస్తున్న స్కామర్‌లు