Home   »  టెక్నాలజీ   »   Tesla Optimus Robot | “ఆప్టిమస్‌” రోబోట్‌ను చూశారా.?

Tesla Optimus Robot | “ఆప్టిమస్‌” రోబోట్‌ను చూశారా.?

schedule raju

Tesla Optimus Robot | హ్యూమనాయిడ్‌ రోబోట్‌ ‘ఆప్టిమస్‌’ వీడియో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ (X)లో షేర్‌ చేసాడు.

Elon Musk shared a video of the Tesla Optimus robot on Twitter

Tesla Optimus Robot | టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ (X)లో షేర్‌ చేసిన హ్యూమనాయిడ్‌ రోబోట్‌ ‘ఆప్టిమస్‌’ వీడియో వైరలవుతోంది. ‘ఆఫ్టిమస్‌తో వాకింగ్‌కు వెళ్తున్నా అని మస్క్‌ ట్వీట్‌ చేయగా, దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. “రోబో ఎంతో అద్భుతంగా ఉంది. కానీ ఇది మానవాళికి ప్రమాదకరంగా మారనంతవరకే’ అని కొందరు రిప్లై ఇవ్వగా, ఇది మనుషులు చేయలేనివి కూడా చేయగలదని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Tesla AI డే ఈవెంట్‌ | Tesla Optimus Robot

ఇది ఆప్టిమస్ హ్యూమనాయిడ్ యొక్క రెండవ వీడియో అని మస్క్ దీనిని పంచుకున్నారు. మునుపటి వీడియోలో, ఈ రోబోట్ చొక్కా మడతపెట్టినట్లు చూపించినారు. ఈ వీడియో టైటిల్ కూడా ‘ఆప్టిమస్ ఫోల్డ్స్ ఏ షర్ట్’ అని తెలిపారు. ఆప్టిమస్ ప్రస్తుతం ఏ పనిని పూర్తిగా మరియు ఒంటరిగా చేయలేనప్పటికీ, టెస్లా ఇంజనీర్లు త్వరలో ఆప్టిమస్‌ పనులను చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నారు. కంపెనీకి చెందిన ఈ రోబోట్‌ను తొలిసారిగా 2021లో జరిగిన టెస్లా AI డే ఈవెంట్‌లో ప్రదర్శించారు. ఈ రోబోను టెస్లా బాట్ అని కూడా పిలుస్తారు.

2022లో, టెస్లా ఈ రోబోట్ యొక్క నమూనాను ప్రారంభించింది. ఇది నడవడమే కాకుండా చిన్న పనులను కూడా పూర్తి చేసింది. ఈ రోబోట్ యొక్క లైవ్-ప్రెజెంటేషన్ వీడియోలో, ఈ రోబోట్ వస్తువులను ఎత్తడం మరియు మొక్కలకు నీరు పెట్టడం వంటి పనులను చేయగలదని చూపబడింది. దీని తరువాత, Optimus Gen 2 రోబోట్ 2023 సంవత్సరంలో తయారు చేశారు.

Also Read: Tesla Optimus Gen 2 రోబోను పరిచయం చేసిన ఎలాన్ మస్క్