Home   »  టెక్నాలజీ   »   Gmail Tips | ఇమెయిల్స్ అన్ని ఒకేసారి డిలీట్ చేయాలా.. అయితే ఇలా చేయండి…

Gmail Tips | ఇమెయిల్స్ అన్ని ఒకేసారి డిలీట్ చేయాలా.. అయితే ఇలా చేయండి…

schedule sirisha

Gmail Tips | ఇతర మెయిల్‌లతో మీ Gmail నిల్వ నిండిందా? ఒక్కో మెయిల్ ని డిలీట్ చేసే ఓపిక లేదు.. అయితే ఒక్క క్లిక్ తో అనవసరమైన మెయిల్స్ అన్నీ డిలీట్ చేయండి…

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇమెయిల్‌ లు అవసరం. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కరికీ మెయిల్‌లో ఖాతా ఉండటం సహజం. మనం స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగిస్తే మెయిల్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది.

అది లేకుండా మన ఫోన్ అస్సలు ఉండదు. ఎక్కువ మంది Gmail వాడుతున్నారు. వీటిలో కొన్ని మెయిల్స్ మనకు తెలియకుండానే వచ్చి ఇన్‌బాక్స్‌ని నింపుతాయి. ఇవి ఎక్కువగా అనవసరమైన మెయిల్స్ వస్తుంటాయి. దీంతో గూగుల్ ఇచ్చిన Gmail 15GB ఉచిత లిమిట్ కాస్త అయిపోతుంది.

అప్పుడు ఇన్‌బాక్స్‌లోని మెయిల్స్‌లో ఏది ముఖ్యమైనది మరియు ఏది అనవసరమో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. కానీ ఒక పరిష్కారం ఉంది. అందుకు కొన్ని స్టెప్స్ ఫాలో అయితే నిమిషాల్లో అనవసర మెయిల్స్ డిలీట్ చేసుకోవచ్చు.

కొంతమంది తమ Gmailలో వేలకొద్దీ ఇ-మెయిల్‌లను పోగు చేసుకుంటారు. వాటిని తొలగించడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే Gmail ఒకేసారి 50 కంటే ఎక్కువ మెయిల్‌లను ఎంచుకోదు. అయితే ఫీచర్ ద్వారా వాటిని ఒకేసారి డిలీట్ చేసే అవకాశం ఉంది.

Gmail Tips | మెయిల్స్‌ ఒకేసారి డిలీట్ చేసే ఆప్షన్

  • ఆండ్రాయిడ్ ఫోన్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో జీమెయిల్ ఓపెన్ చేయాలి.
  • అందులోని Search ఆప్షన్లో is:unread అని టైప్ చేయాలి.
  • పైన కనిపించే టిక్ బాక్స్‌ను సెలెక్ట్ చేయడం ద్వారా అక్కడ కనిపించే 50 మెయిల్స్‌ను మాత్రమే సెలక్ట్ చేయగలం.
  • దాని పక్కనే ‘select all conversations that match this search’ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయాలి.
  • మెయిల్ బాక్స్ లో చదవని మెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే అందులో అవసరమైన మెయిల్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి.
  • పైన కనిపించే డిలీట్ గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా వాటన్నింటినీ ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు.

Also read: AI Boost: వాతావరణ సూచనల కోసం AI ని వినియోగించనున్న భారత్