Home   »  టెక్నాలజీ   »   ఐఫోన్ 13 పై భారీ డిస్కౌంట్.. . కొనేందుకు ఇదే సరైన టైమ్

ఐఫోన్ 13 పై భారీ డిస్కౌంట్.. . కొనేందుకు ఇదే సరైన టైమ్

schedule raju

ఆపిల్ ఐఫోన్ యూజర్లకు పండగే.. మరికొద్దిరోజుల్లో ఐఫోన్ 15 లాంచ్ కానుంది. అంతకంటే ముందే ఐఫోన్ 13పై భారీ తగ్గింపు పొందవచ్చు. ప్రత్యేకించి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ లో ఆపిల్ ఐఫోన్ 13 ధర తగ్గింది. వినియోగదారులు ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా భారీ డిస్కౌంట్ పొందవచ్చు. రాబోయే కొత్త ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న లాంచ్ కానుందని ఆపిల్ ప్రకటించింది. ఐఫోన్ 13 పాత మోడల్ కావడంతో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ధర చాలా తక్కువగా ఉండవచ్చు.

ఐఫోన్‌ 13 మోడల్‌పై బ్యాంక్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లతో ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్‌ 13 ధర రూ.69,900 కాగా.. ప్రస్తుతం ఈ ఫోన్‌ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ.58,999కే లభిస్తోంది. అదే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు సాయంతో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.3 వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు.

దాదాపు రూ. 80వేల కన్నా ఎక్కువ ఖర్చు చేయగల వ్యక్తులు ఐఫోన్ 15 కోసం వేచి ఉండాలి. ఐఫోన్ 15 లాంచ్ అయిన తర్వాత పాత ఐఫోన్ల ధర మరింత తగ్గుతుందని భావిస్తున్నారు. ఐఫోన్‌ 15 లాంచ్ తర్వాత ఐఫోన్‌ 14 ధరల్లో కూడా సవరణలు చోటు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్‌ 14 అధికారికంగా యాపిల్‌ స్టోర్‌లో రూ.79,900కి లిస్ట్‌ అయింది. ఐఫోన్‌ 13 ధర రూ.69,900గా ఉంది.