Home   »  టెక్నాలజీ   »   K2-18 b: భారీ సముద్రం ఆనవాళ్లు… భూమిని పోలిన మరో గ్రహంపై జీవం ఉనికి..?

K2-18 b: భారీ సముద్రం ఆనవాళ్లు… భూమిని పోలిన మరో గ్రహంపై జీవం ఉనికి..?

schedule raju

K2-18 b: విశ్వం అంతా మహాసముద్రం అనుకుంటే ఇప్పటి వరకు మనకు తెలిసింది కేవలం ఒక నీటి చుక్క మాత్రమే. ఇంత పెద్దదైన బ్రహ్మాండంలో భూమి లాంటి గ్రహాలు లక్షల్లో ఉన్నా కూడా వాటిని మనం గుర్తించలేము.

ఎందుకంటే మన సూర్యుడు ఉన్న మిల్కీవే గెలాక్సీలోనే కొన్ని మిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి.

మిల్కీవే గెలాక్సీని దాటాలంటేనే కొన్ని వేల ఏళ్ల కాంతి సంవత్సాల సమయం పడుతుంది. అలాంటిది ఈ విశ్వంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి.

Also Read: Samudrayaan | సముద్రయాన్‌ మిషన్‌.. సముద్రంలో 6000 మీటర్ల లోతుకి ముగ్గురు అక్వానాట్స్‌

అయితే అంతరిక్షంలో భూమిని పోలిన గ్రహాలను, వాటిపై జీవం ఉనికికి సంబంధించిన పరిశోధనలలో కీలకమైన విషయాన్ని గుర్తించినట్లు నాసా (NASA) తాజాగా ప్రకటించింది.

శాస్త్రవేత్తలు మాత్రం భూమి లాంటి గ్రహాలను కనుగొనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కొన్ని వందల సంఖ్యలో ఎక్సో ప్లానెట్లను కనుగోన్నారు.

అయితే తాజాగా కే2-18 బి (K2-18 b) అనే భూమి లాంటి గ్రహాన్ని గురించి శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు.

Also Read: NASA: అంగారకుడిపై నాసా… ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసిన మెషీన్.!

భూమికి 120 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కూల్ మరుగుజ్జు నక్షత్రం కే2-18 (K2-18) చుట్టూ తిరుగుతోంది. ఈ గ్రహం కూడా భూమిలాగే నివాసయోగ్యమైన జోన్ లో ఉంది.

భూమితో పోలిస్తే దాదాపుగా 8.6 రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉంది. ఈ గ్రహం మొత్తం మహాసముద్రాలతో నిండిపోయి ఉంది.

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (James Webb Space Telescope) సాయంతో కే2-18 బి గ్రహాన్ని గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహంపై మీథేన్, కార్బన్ డయాక్సైడ్ ఉనికిని గుర్తించినట్లు వివరించారు.

ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ ఉనికి ఆధారంగా ఈ గ్రహం ఉపరితలం కింద మహా సముద్రం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు.

అంతేకాదు, జీవం ఉన్నచోట మాత్రమే ఉత్పత్తయ్యే డిమెథైల్ సల్ఫైడ్ (డీఎంఎస్) ఆనవాళ్లను కూడా ఈ గ్రహంపై గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.