Home   »  టెక్నాలజీవార్తలు   »   Microsoft కంపెనీ Bing Chat Enterpriseని ప్రవేశపెట్టింది

Microsoft కంపెనీ Bing Chat Enterpriseని ప్రవేశపెట్టింది

schedule sirisha

శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం Microsoft కంపెనీ Bing Chat Enterpriseని ప్రవేశపెట్టింది. ఇది పని కోసం కృత్రిమ మేధస్సు (AI)-ఆధారిత చాట్‌ను అందిస్తుంది.

Bing Chat Enterprise ప్రివ్యూలో అందుబాటులోకి వచ్చింది. అంటే 160 మిలియన్లకు పైగా ప్రజలు ఇప్పటికే యాక్సెస్ చేస్తున్నారని కంపెనీ మంగళవారం వెల్లడించింది.

ఇది వాణిజ్య డేటా రక్షణ కోసం పని చేయడానికి సంస్థలకు AI-ఆధారిత చాట్‌ను అందిస్తుంది. Bing Chat Enterpriseతో వినియోగదారుల వ్యాపార డేటాను సురక్షితంగా ఉంచి సంస్థ నుండి బయటకు ఎలాంటి లీక్ జరగకుండా జాగ్రత్త పడుతుంది. “చాట్ డేటా సేవ్ చేయబడదు, మైక్రోసాఫ్ట్‌కు ఎలాంటి యాక్సెస్ లేదు. అంటే మీ డేటాను ఎవరూ చూడలేరు.” అని టెక్ దిగ్గజం వివరించారు.