Home   »  టెక్నాలజీ   »   విజయవంతంగా ల్యాండ్ అయిన పుష్పక్ విమానం..!

విజయవంతంగా ల్యాండ్ అయిన పుష్పక్ విమానం..!

schedule raju

Pushpak | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) టెక్నాలజీ రంగంలో మరో ఘనత సాధించింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్ ‘పుష్పక్‌’ను (Pushpak) ఇస్రో శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది.

Successfully landed ISRO Pushpak aircraft

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శుక్రవారం ఉదయం 7 గంటలకు కర్ణాటకలోని చల్లకేరేలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) నుండి ‘పుష్పక్’ అనే రీ యూజబుల్ లాంచ్ వెహికల్ (RLV) ల్యాండింగ్ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇది RLV యొక్క మూడవ ల్యాండింగ్ మిషన్. అంతకుముందు 2016 ఏప్రిల్‌లో ఇస్రో సంస్థ విజయవంతంగా RLV మిషన్‌లను నిర్వహించింది.

100 కోట్లతో Pushpak ప్రాజెక్ట్

RLV మిషన్‌కి రామాయణంలో పేర్కొనబడిన పుష్పక విమానం పేరు పెట్టారు. కర్నాటకలోని చిత్రదుర్గలో DRDO యొక్క ఏరియల్ టెస్ట్ రేంజ్‌లో దీనిని పరీక్షించారు. పునర్వినియోగ ప్రయోగ వాహనం పుష్పక్‌ను భారత వైమానిక దళం హెలికాప్టర్ ద్వారా దాదాపు 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి రన్‌వేపై ల్యాండింగ్‌కు విడుదల చేశారు. రన్‌వే నుండి 4 కి.మీ దూరం చేరుకున్న తర్వాత, పుష్పక్‌ స్వయంగా క్రాస్‌ రేంజ్‌ కరెక్షన్‌లతో పాటు రన్‌వేపై ల్యాండ్‌ అయింది. బ్రేక్‌ పారాచూట్‌, ల్యాండింగ్‌ గేర్‌ బ్రేక్స్‌, నోస్‌ వీల్‌ స్టీరింగ్‌ సిస్టమ్‌ సాయంతో స్వయంగా ఆగినట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.

రూ. 100 కోట్లతో ఇస్రో ‘పుష్పక్ విమాన్’ ప్రాజెక్టు చేపట్టింది. 2012లో ఈ రాకెట్ డిజైన్‌కు ఆమోదం లభించడంతో ఇస్రో RLV-TD పేరిట ప్రయోగాత్మక పునర్వినియోగ రాకెట్ మోడల్‌ను రూపొందించింది. ఈ రాకెట్‌ సామర్థ్యాలను 2016లో తొలిసారిగా పరీక్షించారు. పునర్వినియోగ సామర్థ్యం ఉన్న రాకెట్‌తో అంతరిక్ష ప్రయోగాల్లో వ్యర్థాల విడుదల తగ్గుతుందని ఇస్రో తెలిపింది.

Also Read: భూమికి సంబంధించిన ప్రత్యేకమైన ఫొటోను విడుదల చేసిన ఇస్రో..!