Home   »  టెక్నాలజీ   »   ఐఫోన్‌ 15 సిరీస్‌ సెప్టెంబర్‌ 12న లాంచ్‌

ఐఫోన్‌ 15 సిరీస్‌ సెప్టెంబర్‌ 12న లాంచ్‌

schedule raju

ఐఫోన్‌ 15 సిరీస్‌ను భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్‌ 12న రాత్రి 10:30 గంటలకు తన “అపిల్ వండర్ లస్ట్” ఈవెంట్‌లో లాంచ్‌ చేయనున్నట్లు యాపిల్‌ సంస్థ ప్రకటించింది. ఐఫోన్‌ 15 సిరీస్‌ తో పాటు, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9, యాపిల్‌ వాచ్‌ అల్ట్రా-2 వంటి ప్రాడక్ట్స్‌ను ఈ ఈవెంట్‌లో కంపెనీ విడుదల చేస్తుందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. ఐఫోన్‌ 15 సిరిస్‌లోని 4 కొత్త వేరియంట్‌లు ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌లను లాంచ్‌చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే వీటికి సంబంధించిన ఫీచర్లు, కలర్ వేరియంట్ల గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 యొక్క అన్ని మోడల్‌లు డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్‌, కర్వ్‌డ్‌ డిజైన్, USB టైప్ C ఛార్జింగ్ సపోర్ట్‌తో రావొచ్చని ఇప్పటికే సోషల్ మీడియోలో ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 12 న దీనిపై క్లారిటీ రానుంది.

ఐఫోన్ 15 ప్రొ ఫీచర్స్

ఐఫోన్ 15 ప్రొ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండనున్నాయి. వీటిలో 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది దాదాపు ఐఫోన్ 14 ప్రో మోడల్స్ తరహా లోనే ఉంటుంది.  ఐ ఫోన్ 15 ప్రో మాక్స్ లో కొత్తగా ఏ 17 చిప్ ను, అలాగే, 5 జీ క్వాల్ కాం మోడెమ్ చిప్ ను అమర్చనున్నట్లు సమాచారం. అలాగే డైనమిక్ ఐలాండ్ డిజైన్తో ఐఫోన్ 15 ప్రో మాక్స్ వస్తుందని తెలుస్తోంది.

ఐఫోన్ 15 ప్రొ ఫీచర్స్ మరియు ధర

ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ కెమెరా జూమింగ్ క్యాపబిలిటీస్ ని మరింత పెంచారని, సరికొత్త పెరిస్కోప్ లెన్స్ ద్వారా 5x నుంచి 6x వరకు ఆప్టికల్ జూమ్ ను పెంచడానికి వీలవుతుందని నిపుణులు చెప్తున్నారు. సామ్సంగ్ హై ఎండ్ మోడల్స్ కు పోటీగా కెమెరా క్వాలిటీని పెంచినట్లు తెలుస్తోంది.

ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ బ్లూ, సిల్వర్, గ్రే, బ్లాక్ కలర్స్ లో లభించనుంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ కన్నా 200 డాలర్ల వరకు అధికంగా ఉండవచ్చు. ఇవన్నీ కూడా ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ కు సంబంధించిన అంచనాలు మాత్రమే.