Home   »  టెక్నాలజీ   »   Google Trends | గూగుల్ ట్రెండ్స్ శోధనలలో TS కాంగ్రెస్ ముందంజ

Google Trends | గూగుల్ ట్రెండ్స్ శోధనలలో TS కాంగ్రెస్ ముందంజ

schedule sirisha

తెలంగాణ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గూగుల్ ట్రెండ్స్ (Google Trends) డేటాలో అంచనాలు మరియు వ్యూహాత్మక ప్రచారం క్యాప్చర్ చేయబడుతుంది. ప్రాంతీయ గూగుల్ సెర్చ్ డేటాను విశ్లేదించినపుడు గత 90 రోజులుగా తెలంగాణలో అత్యధికంగా శోధించినది కాంగ్రెస్ అని తేలింది.

TS Congress Hike in Google Trends Searches

Google Trends | గూగుల్ ట్రెండ్స్ శోధనలలో కాంగ్రెస్ హైక్

సెప్టెంబరు 17న సోనియా గాంధీ పార్టీ ‘ఆరు వాగ్దానాల’ మొదటి మేనిఫెస్టోని విడుదల చేసారు. ఇది కాంగ్రెస్ శోధన యొక్క ఆసక్తిని పెంచింది.

అక్టోబర్ 15న పార్టీ 58 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించిన తర్వాత కూడా ఇదే విధమైన హైక్ మొదలయ్యింది. ఆ తర్వాత అక్టోబర్ 26న కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు రాహుల్ గాంధీ రెండో దశ ‘బస్సు యాత్ర’ షెడ్యూల్ విడుదలైంది. ఎట్టకేలకు నవంబర్ 17న పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడంతో శోధన మళ్లీ వేగం పుంజుకుంది.

ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వివాదాలపై సెంట్రల్ ప్యానెల్ దర్యాప్తుపై భారతీయ జనతా పార్టీ (BJP) మొదటగా ఆసక్తిని చూపటంతో శోధన మరింత ఎక్కువయ్యింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రధాని రోడ్ షో చేసినప్పుడు BJP కొంత ట్రేండింగ్ లోకి వచ్చింది.

అదే సమయంలో భారత రాష్ట్ర సమితి (BRS) శోధన ఆసక్తిలో స్థిరమైన ఆధిక్యాన్ని అందిపుచ్చుకుంది. అక్టోబర్ 15న గరిష్ట స్థాయికి చేరింది. మిషన్ చాణక్య అధ్యయన నివేదిక విడుదలైనప్పుడు, అది ప్రతిపక్ష పార్టీల కంటే BRS ఆధిక్యాన్ని పెంచుకున్నాయి.

గూగుల్ ట్రెండ్స్ డేటాలో చారిత్రాత్మకంగా నవంబర్ 30 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సెర్చ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండగా, GHMC ఎన్నికల సమయంలో అత్యున్నత స్థాయిలో ఉన్న బీజేపీ సెర్చ్ ఇంట్రెస్ట్ బాగా తగ్గింది. ప్రస్తుతం ట్రేండింగ్ లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది.

Also read: కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు:KTR