Home   »  టెక్నాలజీ   »   WhatsApp latest features: త్వరలో అందుబాటులోకి రానున్న వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్స్

WhatsApp latest features: త్వరలో అందుబాటులోకి రానున్న వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్స్

schedule sirisha

WhatsApp latest features: వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరికొన్ని ప్రత్యేక ఫీచర్లను త్వరలో తీసుకురాబోతోంది. ఈ ఫీచర్లతో మీరు మీ ఫోన్ నుండి ఫైల్‌లను చాలా వేగంగా బదిలీ చేయవచ్చు. వీటితో పాటు ఏయే ఫీచర్లు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.

WhatsApp latest features

WhatsApp latest features: Meta data యొక్క ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp, మీ ఫోన్ నుండి ఫైల్‌లను ఇతర డివైజ్‌ లోకి పంపడానికి అనుమతించే కొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకువస్తుంది. వాట్సాప్ బ్లూటూత్ సహాయంతో ఫైల్ లను పంపుకునేవిధంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.

ఈ ఫీచర్‌తో, వినియోగదారులు వాట్సాప్‌లో పెద్ద ఫైల్‌లను బదిలీ చేయడానికి ఇకపై ఇబ్బందులు ఉండవు. మీ చుట్టూ ఉన్న వారి డివైజ్‌లోకి పెద్ద ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్సు చేసుకోవచ్చు. అంతేకాదు ఆండ్రాయిడ్ యూజర్ల డేటా కూడా పూర్తిగా సురక్షితం. దీనికి సంబంధించి, Wabetainfo ఇటీవల ఈ ఫీచర్ గురించి వెల్లడించింది.

WhatsApp latest features | వాట్సాప్‌లో కొత్త ఫీచర్

టెక్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు సమీపంలోని ఇతర వాట్సాప్ యూజర్లకు ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం యాప్‌కి ‘people nearby‘ అనే ఆప్షన్ అందుబాటులోకి రానుంది.

బ్లూటూత్‌ని ఆన్ చేయడం ద్వారా, మీరు సమీపంలోని WhatsApp వినియోగదారులకు సులభంగా ఫైల్‌లను పంపవచ్చు. కానీ మీరు పండానికి ముందు అవతలి వైపు ఉన్న వ్యక్తి మీకు యాక్సెస్ ఇవ్వాలి. ఫైల్ FTPకి బదిలీ అవుతుంది. ఈ ఫీచర్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడింది. అంటే, వినియోగదారుల సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి ఈ ఫీచర్ పనిచేస్తుందని అర్ధం.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందంటే

ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకునే వారు ముందుగా సెండర్, రిసీవర్ ఇద్దరూ ఈ ఫీచర్ ఆన్ చేసి ఉంచినప్పుడు మాత్రమే ఈ ఫీచర్ పని చేస్తుంది. షేర్ చేయడానికి ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిసీవర్‌కి రిక్వస్ట్ పంపి యాక్సెప్ట్ చేస్తే చాలు ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి.

కాబట్టి మీకు కావలసినప్పుడు మీ ఫైల్‌లను బదిలీ చేయవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీరు ఒకేసారి 2GB వరకు డేటా ఫైల్‌లను పంపవచ్చు. ఇది కాకుండా మరికొన్ని ప్రయోజనాలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు టెక్ అధికారులు తెలిపారు. త్వరలో ఇవి వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నాయి.

Also read: WhatsApp Nearby Share | త్వరలో కొత్త అప్‌డేట్ ను ప్రవేశపెట్టనున్న WhatsApp