Home   »  Telangana Elections 2023   »   తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన రాజాసింగ్..!

తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన రాజాసింగ్..!

schedule mahesh

హైద్రాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. రేపు గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. సమయం ముగిసిన తర్వాత కూడా క్యూలో ఉన్నవారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

Raja Singh

బీజేపీకి 40 సీట్లు వస్తాయని జోస్యం చెప్పిన రాజాసింగ్

పోలింగ్ సజావుగా సాగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP) శాసనసభ్యుడు T.రాజా సింగ్ (Raja Singh)ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఆయన తన సొంత నియోజకవర్గం గోషామహల్ నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 40 సీట్లు వస్తాయని రాజా సింగ్ జోస్యం చెప్పాడు.

మరో 50 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తామన్న Raja Singh

మరో 50 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని తెలిపారు. 45 రోజులుగా గోషామహల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నమస్కారం చేశానని, అందరి మదిలో బీజేపీనే ఉందని తెలిపారు. బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా ఆదరించారో, ఈ ఎన్నికల్లోనూ అదే విధంగా ఆదరిస్తారని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేయడం జరిగింది.

ఓట్ల లెక్కింపు రోజు తెలంగాణలో కమలం పువ్వు మాత్రమే వికసిస్తుందన్న Raja Singh

ఓట్ల లెక్కింపు రోజు తెలంగాణలో కమలం పువ్వు మాత్రమే వికసిస్తుందని మరే పార్టీకి అవకాశం లేదని స్పష్టం చేయడం జరిగింది. తన నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని గతంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని మండిపడ్డారు. ప్రభుత్వంతో పోరాడి 500 కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసానని రాజా సింగ్ తెలిపారు.

Also Read: ఎంపీ బండి సంజయ్‌ ఓ శక్తి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌