Home   »  Telangana Elections 2023   »   తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ ఇప్పటి నుండే సంబరాలు చేసుకోవచ్చు: రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ ఇప్పటి నుండే సంబరాలు చేసుకోవచ్చు: రేవంత్ రెడ్డి

schedule mahesh

హైదరాబాద్: తెలంగాణ లో ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్‌ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపు అన్ని సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి.

Revanth Reddy

రాష్ట్రంలో భూస్వామ్య పాలన డిసెంబర్ 3తో ముగుస్తుందన్న Revanth Reddy

అయితే గురువారం సాయంత్రం పోలింగ్ అనంతరం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ రాష్ట్రంలో భూస్వామ్య పాలన డిసెంబర్ 3తో ముగుస్తుందన్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు విజయోత్సవ వేడుకల కోసం డిసెంబర్ 3 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని, గురువారం రాత్రి నుంచే సంబరాలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీకి నిన్న పోలింగ్ జరిగింది, పోలింగ్ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. 2018లో లాగా బీఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీడియా ముందుకు రాకపోవడం ఓటమిని ఒప్పుకున్నట్లు తెలుస్తోందన్నారు.

కేటీఆర్‌ కూడా త్వరలోనే అమెరికాకు వెళ్లిపోతారని జోస్యం చెప్పిన రేవంత్

కేటీఆర్‌ కూడా త్వరలోనే అమెరికాకు వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. అధిష్ఠానం సూచన ప్రకారం సీఎల్పీ సమావేశం నిర్వహిస్తామని రేవంత్ వెల్లడించారు. సీఎల్పీలో చర్చించి ప్రభుత్వ ఏర్పాటు తేదీని నిర్ణయిస్తామన్నారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎంఐఎం ప్రస్తుతం బీజేపీతో ఉందని అందుకే మైనార్టీలను ప్రభుత్వంలో కలుపుకొని పోతామని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ నేతలది మేకపోతు గాంభీర్యమన్న రేవంత్

కాంగ్రెస్ పార్టీ కి మెజార్టీల పట్ల ఉన్న విధానమే మైనార్టీల పట్ల వుంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపులో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వానిది కీలకపాత్ర అని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలది మేకపోతు గాంభీర్యమని ప్రజలంటే వారికి చిన్నచూపు అని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేయడం జరిగింది.

ప్రభుత్వ నిర్ణయాల్లో విపక్షాల అభిప్రాయాలకు విలువ వుంటుందన్నారు. కేసీఆర్‌​లాగా నిరంకుశంగా కాంగ్రెస్‌ నేతలు ఉండరన్నారు. ప్రజల సమస్యలు చూపించే మీడియాకు కూడా స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. తాము పాలకులుగా ఉండమని సేవకులుగా ఉంటామన్నారు.

Also Read: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదు