Home   »  తెలంగాణ   »   ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేసిన 16 మంది అభ్యర్థులు..

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేసిన 16 మంది అభ్యర్థులు..

schedule mounika

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి (ఎమ్మెల్సీ) ఉప ఎన్నికకు నామినేషన్ల కు (Nominations for MLC by-election) సోమవారం చివరి రోజు కావడం తో మొత్తం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 16 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేయగా పోటీకి బీజేపీ దూరంగా ఉండడం గమనార్హం. వీరిలో 13 మంది స్వతంత్రంగా పోటీ చేస్తుండగా, ఒక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి, ఇద్దరు అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు.

Nominations for MLC by-election | MLC నామినేషన్‌ దాఖలు చేసిన మన్నె జీవన్‌రెడ్డి..

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి మూడు సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి నామినేషన్‌ వేసేందుకు పార్టీ ఉమ్మడి జిల్లా ప్రజా పతినిధులు, ముఖ్య నాయకులు తరలొచ్చారు. జీవన్‌రెడ్డి మూడు సెట్లు దాఖలు చేశారు. దింతో కలెక్టరేట్‌ ప్రాంగణం నాయకులతో కిటకిటలాడింది. 

కాగా, మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ కోటాలో మొత్తం ఓటర్లు 1,439 మంది ఉండగా.. ఇందులో ఇద్దరు MPలు, 14 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 888 ఎంపీటీసీలు, 83 జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

ALSO READ: KCR తో బీఆర్‌ఎస్‌ నేతల భేటీ..