Home   »  తెలంగాణ   »   గృహలక్ష్మి కి 17 లక్షల దరఖాస్తులు

గృహలక్ష్మి కి 17 లక్షల దరఖాస్తులు

schedule raju

తెలంగాణ: గృహలక్ష్మి పథకానికి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి.  అయితే ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. దరఖాస్తులకు గురువారమే ఆఖరు అని చెప్పడంతో వేలాది మంది మండల కేంద్రాలకు తరలివచ్చారు.

3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పడంతో రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు. అయితే అప్లికేషన్‌ తీసుకున్న తర్వాత ఎలాంటి రసీదు ఇవ్వలేదని, కంప్యూటర్‌లోనూ రికార్డు చేయలేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.