Home   »  తెలంగాణవార్తలు   »   ఉమ్మడి కరీంనగర్ లో నిత్యం 30 లక్షల కోడి గుడ్లు!

ఉమ్మడి కరీంనగర్ లో నిత్యం 30 లక్షల కోడి గుడ్లు!

schedule raju

ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. కూరగాయలకు ప్రత్యామ్నాయంగా కోడి గుడ్లను వినియోగిస్తున్నారు. మార్కెట్లో కూరగాయల ధరలు కిలోకి వందకు పైనే ఉన్నాయి. అదే కోడి గుడ్ల ధరలు ఒక్కో గుడ్డుకి రూ.5 చొప్పున ఉండడంతో వీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిత్యం30 లక్షల వరకు గుడ్లను వినియోగిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 250 నుంచి 800 ఫౌల్ట్రీ ఫారాలు ఉండగా అందులో లేయర్‌ కోళ్లు కోటి వరకు ఉంటాయి. వీటి నుంచి నిత్యం 80 లక్షలకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలో 30 లక్షల వరకు అమ్ముతున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. కూరగాయల ధరలు అమాంతం పెరగడం, ఇతర కారణాల నేపథ్యంలో జిల్లాలో రోజుకు 30 లక్షల గుడ్లు వినియోగిస్తున్నారు. మిగిలినవి నాగ్‌పూర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ లాంటి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు జిల్లా ఫౌల్ట్రీ రైతుల సంఘం ప్రతినిధి వెంకటరమణా రెడ్డి తెలిపారు.