Home   »  తెలంగాణ   »   Electric Shock | విద్యుదాఘాతంతో నాలుగేళ్ల బాలిక మృతి

Electric Shock | విద్యుదాఘాతంతో నాలుగేళ్ల బాలిక మృతి

schedule sirisha

నిజామాబాద్: సూపర్ మార్కెట్ లో రిఫ్రిజిరేటర్ ను తెరిచేందుకు ప్రయత్నించిన నాలుగేళ్ల బాలిక విద్యుదాఘాతానికి (Electric Shock) గురై అక్కడికక్కడే మరణించింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో సోమవారం జరిగిన ఈ ఘటనచోటుచేసుకుంది ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

సూపర్‌ మార్కెట్‌ లో కరెంట్ షాక్ (Electric Shock)

రిషిత తన తండ్రి రాజశేఖర్‌తో కలిసి కూరగాయల కోసం సూపర్‌ మార్కెట్‌ కు వెళ్లింది. అతను ఫ్రిజ్‌లో ఐస్‌క్రీం కోసం వెతుకుతుండగా ఆమె చాక్లెట్ల కోసం పక్కనే ఉన్న ఫ్రిజ్‌ దగరికి వెళ్లింది. తలుపు తాకిన క్షణంలోనే విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది.

ఈ విషయం తెలియక ఆమె తండ్రి ఐస్‌క్రీం కోసం వెతకడం కొనసాగించాడు. కొన్ని సెకన్ల తర్వాత అతను వెనక్కి తిరిగి చూడగా రిషిత ఫ్రిజ్ డోర్‌ తన చేతితో పట్టుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే చిన్నారిని ఎత్తుకుని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సూపర్ మార్కెట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలిక తల్లిదండ్రులు, ఇతర బంధువులు మార్కెట్ ఎదుట ఆమె మృతదేహంతో నిరసనలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చర్యలు చేపట్టారు.