Home   »  తెలంగాణ   »   స్నేహితుడిని పాము కాటేసిందని ఓ యువకుడు ఏం చేసాడంటే… !

స్నేహితుడిని పాము కాటేసిందని ఓ యువకుడు ఏం చేసాడంటే… !

schedule sirisha

భద్రాచలం: తన ప్రాణ స్నేహితుడిని పాము కాటు (Snake Bite) వేయడంతో, ఓ వ్యక్తి ఆవేశం తో పామును కూడా చంపేశాడు. అదే పామును ప్లాస్టిక్ సంచిలో వేసి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జరిగింది.

ఆస్పత్రికి కవర్ లో పామును తీసుకొచ్చిన స్నేహితుడు

నిత్యం రోగులతో రద్దీగా ఉండే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఓ వ్యక్తి కవర్ లో పామును తీసుకొచ్చాడు. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. పాముతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తిని ఏంటని ప్రశ్నించగా తన స్నేహితుడికి పాము కాటు వేసిందని, దాన్ని చంపి వైద్యుడి వద్దకు తీసుకువెళితే అది ఏం పామో చూసి అతనికి వైద్యం చేస్తారని ఆ వ్యక్తి అన్నాడు. కాటు వేసిన పామును వైద్యులు చూసి విరుగుడుకు చికిత్స అందించారు.

పాములు ఎక్కువగా తిరిగే ప్రదేశాలు

పాములు విష జంతువులు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఏ వ్యక్తికైనా భయం సహజమే, చూడకుండా తొక్కితే తప్ప కాటుకు గురయ్యే అవకాశాలు తక్కువ. భయం ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా వ్యాధి నుంచి కోలుకునే అవకాశాలు చాలా తక్కువ. కరోనా సమయంలో కూడా భయంతో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చీకటి ప్రదేశాల్లో విషసర్పాలు సంచరిస్తూ చూడక వెళ్లిన వారిని కాటువేసి ప్రాణాలు పోగొట్టుకునేలా చేస్తున్నాయి. దీంతో ప్రతి సీజన్‌లో అనేక మంది చిన్నారులు, రైతులు మరణిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక కూడా కొంత మంది ప్రజలు మరణిస్తున్నారు.

పాము కాటు (snake bite) వేసిన వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తలు

విషం లేని పాము కాటు వేస్తే మనకు కాటు వేసిన చోట 2 కాకుండా చాలా రంధ్రాలు కనబడతాయి. కాటు వేసిన వెంటనే పైభాగాన్ని గుడ్డతో గట్టిగా కట్టాలి. వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోవాలి.ఎలాంటి ద్రవాలు లేదా ఘనపదార్థాలు తీసుకోవద్దు. శ్వాస ఆగిపోతే కృత్రిమ శ్వాస అందించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు.