హైదరాబాద్: హైదరాబాద్ బాలానగర్ లోని ఓ అపార్ట్మెంట్లో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టడంతో నివాసితులు తమ ఇళ్లల్లో నుండి బయటకు పరుగులు తీశారు.
బాలానగర్ లోని పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. A2A లైఫ్ స్పేస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నిన్న రాత్రి 9 గంటల సమయంలో మంటలు సంబవించాయి. కానీ ప్రాణనష్టం ఏమీ జరగలేదు.
భవనంలోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగినట్లు తెలిపారు. అయినప్పటికీ ఈ మంటలు చాలా త్వరగా ఇల్లంతా వ్యాపించాయి పొరుగు ప్లాట్ల నుండి చూసేవారిని భయాందోళనలకు గురిచేసింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.