Home   »  తెలంగాణ   »   ఉచిత కరెంట్ ప్రయోజనాల కోసం ఆధార్ తప్పనిసరి..!

ఉచిత కరెంట్ ప్రయోజనాల కోసం ఆధార్ తప్పనిసరి..!

schedule mahesh

Gruha Jyothi | ఆధార్ కార్డు ఉన్న వారికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది.

aadhaar-must-for-gruha-jyothi-benefits

Gruha Jyothi | గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను పొందాలనుకునే కుటుంబాలు ప్రామాణీకరణ కోసం ఆధార్ వివరాలను తప్పకుండా అందించాలని తెలంగాణ విద్యుత్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల ఆధార్‌తో విద్యుత్ కనెక్షన్ నంబర్‌ను అనుసంధానం చేయనున్నట్టు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది.

ఆధార్ లేనివాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచన

ఆధార్‌ లేకపోతే వెంటనే UIDAI పోర్టల్ లో నమోదు చేయించుకోవాలని, అథెంటికేషన్‌ చేసే సమయంలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ చూపించాల్సి ఉంటుందని విద్యుత్ షాక్ వెల్లడించింది.శాశ్వత ఆధార్ నంబర్ అందుబాటులోకి వచ్చే వరకు, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌తో పాటు బ్యాంక్ పాస్‌బుక్, పాన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, ఓటర్ ID, ఉపాధి హామీ పథకం కార్డ్, కిసాన్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చని, ప్రామాణీకరణ సమయంలో వేలిముద్రలు తీసుకుంటామని, బయోమెట్రిక్ పని చేయకపోతే ఐరిస్‌ను ఉపయోగిస్తామని విద్యుత్ శాఖ తెలిపింది.

Also Read | మేడారం జాతరకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..!