Home   »  తెలంగాణ   »   ABVP Protest: ABVP కార్యకర్తను జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్.. అసలేం జరిగిందంటే…?

ABVP Protest: ABVP కార్యకర్తను జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్.. అసలేం జరిగిందంటే…?

schedule sirisha

ABVP Protest: అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు వైరల్‌ అవుతుంది. ఒక వీడియోలో విద్యార్థిని జుట్టు పట్టుకుని మహిళా పోలీసులు కిందకు లాక్కెళ్ళిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABVP Protest: Constable who pulled ABVP worker  by hair.

ABVP Protest: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ స్థలాన్ని హైకోర్టు నిర్మాణానికి కేటాయించరాదని ABVP విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 55ను ఉపసంహరించుకోవాలని గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి.

ABVP Protest: శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు

బుధవారం కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో యూనివర్శిటీ భూములను హైకోర్టుకు అప్పగించవద్దని విద్యార్థి నాయకులు నిరసనకు దిగారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు చెదరగొట్టి, పాదయాత్ర చేస్తున్న విద్యార్థి నాయకురాలిని వెంబడించారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని లాగడంతో విద్యార్థిని రోడ్డుపై పడిపోయింది.

కింద పడిన యువతిని జుట్టు విడవకుండా ముందుకు లాక్కెళ్లారు. దీంతో ఆమె చేతులు, కాళ్లు, శరీరం ముందు భాగంలో గాయాలు అయ్యాయి. ఇదేం పద్దతి అని బాధితులు కన్నీరుమున్నీరుగా ప్రశ్నించగా, అలాగే ఉంటుందని మహిళా కానిస్టేబుల్ సూటిగా సమాధానమిచ్చింది. ఈ దృశ్యాలన్నింటినీ మరో విద్యార్థి తన ఫోన్‌లో చిత్రీకరించడంతో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం

మరోవైపు ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించకూడదని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ABVP రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ స్పందించారు.

పోలీసులు క్షమాపణ చెప్పాలన్న MLC కవిత

ఈ ఘటనపై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతి పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు కలకలం రేపుతోంది. ఈ దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు క్షమాపణలు చెప్పాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్ వెంటనే స్పందించి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు. మరోవైపు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల తీరుపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు.

Also read: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్