Home   »  తెలంగాణ   »   అంబులెన్స్ ఆలస్యం…. రోడ్డుపైనే ప్రసవం….?

అంబులెన్స్ ఆలస్యం…. రోడ్డుపైనే ప్రసవం….?

schedule sirisha

నిర్మల్: పెంబి మండలంలో అంబులెన్స్ కోసం ఎదురు చూస్తున్న ఆదివాసీ మహిళ రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వాసుపత్రికి వెళ్లేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా వాహనంలో ఇంధనం అయిపోతోందని చెప్పారు.

పెంబి మండలం మారుమూల తులసిపేట్‌ గ్రామానికి చెందిన గంగామణికి గురువారం రాత్రి ప్రసవ నొప్పులతో నాలుగు గంటల పాటు వేదనను అనుభవించి కుటుంబ సభ్యుల సాయంతో రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అయిన తర్వాతే అంబులెన్స్ వచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.