Home   »  తెలంగాణ   »   ప్రవళిక సూసైడ్ కేసులో మరో సంచలనం … తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం :KTR

ప్రవళిక సూసైడ్ కేసులో మరో సంచలనం … తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం :KTR

schedule sirisha

హైదరాబాద్: ప్రవళిక మృతి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్ అశోక్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ప్రవళిక ఆత్మహత్య (Pravalika suicide case) చేసుకొని మరణించింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయడం వల్లే ఆమె ప్రాణం తీసుకుందని విద్యార్థి సంఘాలతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు లేవనెత్తాయి.

Pravalika Suicide Caseను రాజకీయం చేయవద్దు

అయితే ప్రేమ వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు ఆధారాలతో సహా ప్రకటించారు. అయితే ఆమెను ప్రభుత్వమే హత్య చేసిందని రాజకీయ వర్గాలు ఆరోపిస్తు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె తల్లి, సోదరుడు ఓ వీడియోను విడుదల చేశారు.

తమ కుమార్తె మృతిని రాజకీయం చేయవద్దని అభ్యర్థించారు. ఆమె ఆత్మహత్యకు కారణమైన యువకుడు శివరామ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేటీఆర్

తాజాగా మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై స్పందించారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేటీఆర్, ప్రవళిక మృతిపై కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ప్రవళిక తల్లి దండ్రులు, తమ్ముడు పొద్దున నా దగ్గరకి వచ్చి అన్నా, మా అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. మా అమ్మాయిని ఓ యువకుడు వేధించి తనకు తానుగా ఆత్మహత్య చేసుకునేలా చేసిండు. న్యాయం చేయమని అడిగారు.

కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం అని హామీ ఇచ్చిన ktr

వాళ్లకు ఒక్కటే మాట చెప్పిన. మీకూ, మీ కుటుంబానికి పార్టీ అండగా ఉటుందని చెప్పా. ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాం. కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు కేటిర్.