Home   »  తెలంగాణ   »   ప్రవళిక సూసైడ్ కేసులో మరో కీలక మలుపు….

ప్రవళిక సూసైడ్ కేసులో మరో కీలక మలుపు….

schedule sirisha

తెలంగాణలో సంచలనంగా మారిన ప్రవళిక ఆత్మహత్య కేసు (suicide case) రోజుకో మలుపు తిరుగుతుంది. గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం వల్లే ప్రవళిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందంటూ మొదట బయటికి వచ్చింది.

ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే అసలు కారణం

నిరుద్యోగులు, పలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో ప్రవళిక ఆత్మహత్య కాస్త ఒక్కసారిగా రాజకీయంగా మారింది. కాగా ప్రవళిక ఆత్మహత్యకు గ్రూప్-2 పరీక్ష వాయిదా కారణం కాదని ప్రేమ వైఫల్యమే అసలైన కారణమని పోలీసులు కూడా నిర్దారించి వెల్లడించారు.

అలా చెప్పేందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే పోలీసులు చెప్పిన తర్వాత కూడా ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్య అని కొన్ని రాజకీయ పార్టీలు నిరసన తెలిపాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని, ప్రేమ వైఫల్యం వల్ల కాదని పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఆమె ఆత్మహత్యపై రాజకీయ దుమారంగా మారింది.

సూసైడ్ కేసు (suicide case) ను రాజకీయం చేస్తున్న నేతలు

అయితే ప్రవళిక విషయంలో చెలరేగుతోన్న దుమారంపై ఆమె కుటుంబ సభ్యులు ఒక అనూహ్యమైన విషయాన్నీ వెల్లడించారు. శివరామ్ అనే యువకుడు పెట్టిన వేధింపులు తట్టుకోలేక తమకు చెప్పుకోలేక మనోవేదన అనుభవించి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ప్రవళిక తల్లి విజయ చెప్తుంది.

తన కూతురి ఆత్మహత్యపై రాజకీయం చేయొద్దని నేతలను అభ్యర్ధించింది. రాజకీయాలు ఏమైనా ఉంటె మీలో మీరు చూసుకొండి. తన కూతురి విషయాన్ని మాత్రం వదిలేయండని అంటూ విలపిస్తుంది. తన పిల్లలను చదివించేందుకు కూలీ నాలీ చేసుకుంటూ చాలా కష్టపడ్డామని కన్నీరు మున్నీరవుతుంది.

తన కూతురిని టార్చర్ చేసి, చనిపోయేందుకు కారణమైన శివరామ్‌కు శిక్ష వేసి న్యాయం చేయాలని వేడుకుంది.

ప్రవళిక గురించి అబద్ధాలు చెప్తావా కేటీఆర్‌ అని ప్రశ్నించిన రేవంత్

ప్రవళిక ఆత్మహత్య పై కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు ఆడబిడ్డపై నిందారోపణలు చేస్తే ఎంత దుఃఖం ఉంటుందో ఎప్పుడైనా ఆలోచన చేశావా కేటీఆర్‌ అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి. మీ చెల్లినో, మీ కాక బిడ్డనో చనిపోతే ఇలానే మాట్లాడతావా? అని రేవంత్ మండిపడ్డాడు.

ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక ఏ పరీక్ష రాయలేదని ఓ చానెల్‌ ఆఫీసులో కూర్చొని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అంటూ.. ప్రవళిక అప్లై చేసిన గ్రూప్ 2 కి సంబంధించిన ఆధారాలను చూపించారు రేవంత్.