Home   »  తెలంగాణ   »   గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు… ఆందోళన చెందుతున్న పేదలు.!

గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు… ఆందోళన చెందుతున్న పేదలు.!

schedule raju

గృహలక్ష్మి పథకానికి దాదాపు లక్ష వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 20 నాటికి క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేసి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ప్రభుత్వం మొదటి విడతలో నియోజకవర్గానికి 3వేల ఇళ్ల చొప్పున మంజూరు చేసింది. దరఖాస్తుల పరిశీలన మొదలు కావడంతో గృహలక్ష్మి వరిస్తుందో లేదోననే ఆందోళన పేదల్లో నెలకొంది. మహిళల పేరుతో వచ్చిన వాటిని మాత్రమే అధికారులు పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వం మొదటి విడతలో నియోజక వర్గానికి మూడు వేల ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే జిల్లాకు 6,800 ఇళ్లను కేటాయించింది. వీటికి గాను 20,375 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో గృహలక్ష్మి పథకం ఎవరిని వరిస్తుందోనన్న ఆందోళన పేదల్లో నెలకొంది. ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం రూ.3 లక్షలను చెల్లించనున్నది. ఇంటి నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారులకు మూడు విడతల్లో డబ్బులు చెల్లించనుంది.