Home   »  తెలంగాణ   »   దశలవారీగా రూ.లక్ష సాయం: తలసాని

దశలవారీగా రూ.లక్ష సాయం: తలసాని

schedule raju

తెలంగాణ: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా రూ.లక్ష సాయం అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. రూ.లక్ష మంజూరైన బిసీలకు హైదరాబాద్ లో ఇవాళ ఆయన చెక్కులు అందజేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని వెల్లడించారు.

బుధవారం సనత్ నగర్, జూబ్లిహిల్స్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాలకు చెందిన 1200 మంది బీసీ కులవృత్తి దారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఒకొక్కరికి దశలవారీగా లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే లతో కలిసి అందజేశారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని, అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. అత్యధిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాతనే హైదరాబాద్ నగరంలో బస్తీ, కాలనీ అనే తేడా లేకుండా కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు.