Home   »  తెలంగాణ   »   Auto driver | అప్పుల బాధతో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

Auto driver | అప్పుల బాధతో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

schedule ranjith

కరీంనగర్ | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సమస్యలతో 22 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు ఆటో వినియోగం తగ్గినట్లు నివేదించబడింది.

Auto driver | Auto driver committed suicide due to debt

అప్పుల బాధతో ఆటో డ్రైవర్‌ (Auto driver) ఆత్మహత్య చేసుకున్న ఘటన బెజ్జంకి మండలంలో చోటుచేసుకుంది. CI వెంకటేష్‌ వివరాల ప్రకారం.. కల్లేపల్లికి చెందిన బుర్ర కరుణాకర్‌(44) జీవనోపాధి నిమిత్తం కరీంనగర్ కి వచ్చి ఆటో నడుపుతున్నాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా గిరాకీ ఉండటం లేదని భార్య వద్ద వాపోయేవాడు. ఈ క్రమంలో కొంత అప్పులు చేసిన అతడు బుధవారం మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మరణించాడు.

ఈనెల 16న ఆటోలు బంద్ (Auto driver)

ఈ తరుణంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈనెల 16న ఆటోలు బంద్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని TATU ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: Kota | కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య..