Home   »  తెలంగాణ   »   Balapur |రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డు వేలం

Balapur |రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డు వేలం

schedule mahesh

హైదరాబాద్ : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ (Balapur) మండలం బాలాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన బాలాపూర్ గణేష్ విగ్రహం నిమజ్జనానికి ముందు బాలాపూర్ గణేష్ లడ్డూను రూ.27 లక్షలకు వేలంలో కొనుగోలు వేశారు. ఈ బాలాపూర్ గణేష్ లడ్డూను దాసరి దయానంద్ రెడ్డి కొనుగోలు చేశారు.

రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డు (Balapur)

ఈ గణేష్ లడ్డూ వేలం పాట మూడు దశాబ్దాలుగా జరుగుతుంది. ఈ ఈవెంట్‌ను కవర్ చేయడానికి నగరం నలుమూలల నుండి, దేశవ్యాప్తంగా మీడియాని ఆకర్షిస్తుంది. గతేడాది లడ్డూ రూ.24.60 లక్షలకు వేలం వేయగా ఈ సారి లడ్డూ సరికొత్త రికార్డును సృష్టించింది.

బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి అన్నారు. 2022లో స్థానిక రైతు వంగేటి లక్ష్మారెడ్డి బహిరంగ వేలంలో రూ.24.60 లక్షలకు లడ్డూను కొనుగోలు చేశారు.

1994 నుండి ఆనవాయితీగా వస్తున్న బాలాపూర్ లడ్డు వేలం పాట

గణేష్ లడ్డూ వేలం 1994 నుండి ఆనవాయితీగా వస్తుంది. 1994లో మొదటి సారిగా స్థానిక రైతు కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకు కొనుగోలు చేశాడు. మోహన్ రెడ్డి తన కుటుంబానికి, స్థానికులకు లడ్డూ ప్రసాదం పంపిణీ చేసిన తర్వాత తన పొలంలో చల్లడంతో దిగుబడి పెరిగింది.

అప్పటి నుండి ఈ బాలాపూర్ లడ్డుని వేలం పాటలో దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతుంటారు ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ వివిధ గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

ఈ వేలం పాటలో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ లడ్డు వేలం పాటలో ముస్లింలు కూడా మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు పాల్గొన్నారు.