Home   »  తెలంగాణ   »   తెలంగాణలో మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన BJP..!

తెలంగాణలో మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన BJP..!

schedule raju

Lok Sabha candidates | తాజాగా BJP తెలంగాణలో లోక్ సభ స్థానాలకు మూడో జాబితా విడుదల చేసింది. తెలంగాణలో మిగిలి ఉన్న రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఈ జాబితా విడుదల చేసింది.

BJP announced Lok Sabha candidates in Telangana

హైదరాబాద్ : 17 రాష్ట్రాల నుంచి 111 మంది పేర్లతో సహా లోక్‌సభ అభ్యర్థుల (Lok Sabha candidates) ఐదవ జాబితాను BJP ఆదివారం విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను BJP ప్రకటించింది. తెలంగాణ నుంచి ఆరూరి రమేశ్, తాండ్ర వినోద్ రావులను BJP పార్టీ తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపింది.

వరంగల్ (Sc) నుంచి ఆరూరి రమేశ్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు పోటీ చేయనున్నారు. వరంగల్‌ నుంచి BRS అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఎంపికపై అసంతృప్తి చెందిన BRS మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ ఇటీవల BJPలో చేరారు.

మార్చి 2వ తేదీన 9 మంది అభ్యర్థులతో BJP తొలి జాబితా, ఆరుగురు అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 17 స్థానాల్లో మూడు SC, రెండు ST రిజర్వుడ్‌ స్థానాలను మినహాయిస్తే మిగతా 12 స్థానాల్లో ఐదు BC, నాలుగు రెడ్డి, రెండు వెలమ, ఒక బ్రాహ్మణ అభ్యర్థులకు BJP అవకాశం ఇచ్చింది. అయితే SCలకు సంబంధించిన మూడు రిజర్వుడ్‌ స్థానాలను మాదిగ సామాజికవర్గానికి కేటాయించడం ద్వారా మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని BJP తెలిపింది.

17 మంది BJP Lok Sabha candidates List:

  1. సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి (రెడ్డి)
  2. కరీంనగర్ – బండి సంజయ్ (మున్నూరు కాపు)
  3. నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్‌ (మున్నూరు కాపు)
  4. మల్కాజ్‌గిరి – ఈటల రాజేందర్‌ (ముదిరాజ్‌)
  5. నాగర్‌కర్నూల్‌ (SC) – పోతుగంటి భరత్ (SC మాదిగ)
  6. భువనగిరి – బూర నర్సయ్యగౌడ్‌ (గౌడ్‌)
  7. చేవెళ్ల – కొండా విశ్వేశ్వర రెడ్డి (రెడ్డి)
  8. జహీరాబాద్ – BB పాటిల్‌ (లింగాయత్‌)
  9. హైదరాబాద్ – డాక్టర్ మాధవీలత (బ్రాహ్మణ)
  10. ఆదిలాబాద్ (ST) – గోడం నగేశ్ (ST గోండు)
  11. మహబూబ్ నగర్ – DK అరుణ (రెడ్డి)
  12. మహబూబాబాద్ – సీతారాం నాయక్ (ST లంబాడా)
  13. పెద్దపల్లి – గోమాస శ్రీనివాస్ (SC మాదిగ)
  14. మెదక్ – రఘునందన్ రావు (వెలమ)
  15. నల్గొండ – శానం సైదిరెడ్డి (రెడ్డి)
  16. వరంగల్ (SC) – ఆరూరి రమేశ్ (SC మాదిగ)
  17. ఖమ్మం – తాండ్ర వినోద్ రావు (వెలమ)

Also Read: తెలంగాణలో మరో 7 లోక్‌సభ స్థానాలను ఖరారు చేసిన BJP