Home   »  తెలంగాణ   »   బీటెక్ విద్యార్థి ఆత్మహత్య…

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య…

schedule sirisha

మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ నల్లమల్లారెడ్డి కళాశాల విద్యార్థి విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విజయ్ ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు.

BTech student commits suicide

బీటెక్ విద్యార్థి (BTech student) ఆత్మహత్య

మేడ్చల్: BTech student | మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ నల్లమల్లారెడ్డి కళాశాల విద్యార్థి విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలలో విజయ్ కనిపించక పోవడంతో తోటి విద్యార్థులు యాజమాన్యానికి తెలుపగా వారు పోలీసులకు సమాచారాన్ని అందించారు. వారు వేంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టగా ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌పై విజయ్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.

విజయ్ నల్లమల్లారెడ్డి కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వెంటనే విద్యార్ధి తల్లిదండ్రులకు విషయాన్నీ తెలిపారు. కేసు నమోదు చేసుకొని, పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఆ విద్యార్ధి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే కోణంలో యాజమాన్యాన్ని, తల్లిదండ్రులను, తోటి విద్యార్థులను ప్రశ్నించాల్సి ఉందని పోలీస్ అధికారి తెలిపారు.

Also read: భార్యాభర్తల గొడవలో అడ్డొచ్చిన అత్తను పొడిచిన అల్లుడు…