Home   »  తెలంగాణ   »   మంచిర్యాల వాసులకు శుభవార్త.. మంచిర్యాల నుండి మేడారానికి బస్సులు

మంచిర్యాల వాసులకు శుభవార్త.. మంచిర్యాల నుండి మేడారానికి బస్సులు

schedule ranjith

మేడారం | మంచిర్యాల నుంచి మేడారం (Mancherial to Medaram) సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే ప్రత్యేక బస్సులను MLA ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఆదిలాబాద్ డిపో నుంచి 65 ఆర్టీసీ బస్సులు చెన్నూరు డిపోకి వెళ్లి అక్కడి నుంచి మేడారానికి వెళ్తాయి.

Mancharya to Medara | Good news for the residents of Mancharya.. Buses from Mancharya to Medara

మంచిర్యాల నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే ప్రత్యేక బస్సులను MLA ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఆదివారం ZP బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో RTC అధికారులతో కలిసి బస్సులకు పూజలు చేశారు. అనంతరం జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.

Mancherial to Medaram 75 RTC బస్సులు

ఇక్కడి నుంచి మొత్తం 75 బస్సులు తిరుగుతున్నాయని, రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని MLA తెలిపారు. భక్తులు RTC సేవలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఈ నెల 21 నుంచి 24 వరకు గోదావరి ఒడ్డున జరిగే జాతర ఏర్పాట్లను MLA పరిశీలించారు. ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆదిలాబాద్ నుండి మేడారానికి 65 బస్సులు

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆదిలాబాద్ డిపో మేనేజర్ కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ డిపో నుంచి 65 ఆర్టీసీ బస్సులు చెన్నూరు డిపోకి వెళ్లి అక్కడి నుంచి మేడారానికి వెళ్తాయి. ఫుల్ టికెట్‌ రూ. 420, ఆఫ్ టికెట్ రూ.230. గా నిర్ణయించారు.

Also Read: ఇప్పుడు భక్తులకు అందుబాటులో ‘మై మేడారం’ యాప్‌..!