Home   »  తెలంగాణ   »   కేసీఆర్‌కు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ..

కేసీఆర్‌కు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ..

schedule mounika

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Chandrashekar Rao) గురువారం అర్ధ‌రాత్రి కాలు జారి కిందపడటంతో ఆయ‌న కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌కు తరలించారు.ఆయనను పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు.

Chandrashekar Rao

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Chandrashekar Rao) గురువారం అర్ధ‌రాత్రి కాలు జారి కిందపడటంతో ఆయ‌న కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో I.C.U కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం కేసీఆర్‌కు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నారు.

Chandrashekar Rao ను పరామర్శించిన మాజీ మంత్రులు..

కాగా, దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ అధినేతను మాజీ మంత్రులు జగదీశ్‌ రెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డి పరామర్శించారు.

కేసీఆర్‌ ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు, BRS అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ట్వీట్ చేశారు.

కేసీఆర్ ఆరోగ్యంపై కల్వకుంట్ల కవిత ట్వీట్

దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం కారణంగా మా నాన్న కేసీఆర్‌కి పెద్ద శస్త్ర చికిత్స జరగనుంది. నాన్న కోసం ప్రార్థనలు మరియు ఆశీర్వాదాల వెల్లువను చూసి మేము హత్తుకున్నాము. మా నాయకుడు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించడానికి మేము BRS కుటుంబం మరియు శ్రేయోభిలాషులతో చేరామని కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.

కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సందేశాలు పంపుతున్న వారందరికీ ధ‌న్య‌వాదాలు:KTR

కేసీఆర్ బాత్రూంలో ప‌డిపోవ‌డంతో.. ఆయ‌న కాలికి తీవ్ర గాయ‌మైంద‌న్నారు.డాక్టర్లు హిప్ రిప్లేస్‌మెంట్ స‌ర్జ‌రీ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సందేశాలు పంపుతున్న వారందరికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతూ కల్వకుంట్ల KTR ట్వీట్ చేశారు.

అభిమానులు ఎవరూ హాస్పిటల్‌కు రావొద్దు : హరీశ్‌ రావు

తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ధైర్యం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సాయంత్రం జరిగే తుంటి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి కావాలని, తిరిగి ఆయన పూర్తి ఆరోగ్య వంతుడు కావాలని కోరుకుంటున్నాను. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్‌ రావొద్దని అభిమానులకు హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండడం వల్ల ఎవరు హాస్పిటల్ కి వచ్చి ఇబ్బంది పడొద్దని హరీష్ రావు అన్నారు.

కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని హరీష్ రావు అన్నారు.

ALSO READ: Revanth Reddy: కేసీఆర్ కు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి