Home   »  తెలంగాణ   »   త్వరలో ప్రారంభం కానున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్

త్వరలో ప్రారంభం కానున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్

schedule mahesh

Charlapally Railway Terminal | హైదరాబాద్ నగర శివార్లలోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్టేషన్ జంట నగరాలకు కొత్త ప్రత్యామ్నాయ కోచింగ్ టెర్మినల్‌గా మారనుంది.

charlapally-railway-terminal-will-start-soon

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం త్వరలో చర్లపెల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు కాచిగూడ స్టేషన్లకు భారీగా ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉన్న కారణంగా, చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తే అనేక రైళ్లు చర్లపల్లి నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

220 కోట్లతో చర్లపల్లి స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్న రైల్వేశాఖ

అంతేకాకుండా మిగతా స్టేషన్ ల వద్ద రద్దీని తగ్గించడానికి, పశ్చిమాన ఉన్న లింగంపల్లి స్టేషన్‌ను టెర్మినల్ స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న టెర్మినళ్ల రద్దీని మరింత తగ్గించేందుకు, రైల్వేశాఖ రూ.220 కోట్లతో తూర్పున ఉన్న చర్లపల్లి స్టేషన్‌ను శాటిలైట్ రైల్వే టెర్మినల్‌గా అప్‌గ్రేడ్ చేస్తుంది.

అధునాతన హంగులతో నిర్మితమవుతున్న Charlapally Railway Terminal

చర్లపల్లిలో మౌలిక సదుపాయాల పనులు, కొత్త హైలెవల్ ప్లాట్‌ఫారమ్‌లు, 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, కొత్త స్టేషన్ బిల్డింగ్, సర్క్యులేటింగ్ ఏరియాలో మెరుగుదల, అప్రోచ్ రోడ్డు ఏర్పాటు, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఏర్పాటు, మెయింటెనెన్స్ షెడ్, రెండు FOBలు, 5 ఎస్కలేటర్లు, 9లిఫ్టులు, బయో టాయిలెట్లు మరియు ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్ లు ఉన్నాయి.

జంటనగరాల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నాల్గవ ప్రధాన ప్యాసింజర్‌ టెర్మినల్‌గా మారనుంది. కొత్త టెర్మినల్‌ను విమానాశ్రయాలతో సమానంగా ఆధునిక సౌకర్యాలు, సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నామని SCR జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. ఈ స్టేషన్ సికింద్రాబాద్, నాంపల్లి మరియు కాచిగూడ స్టేషన్లలో భారాన్ని తగ్గించడమే కాకుండా నగర జనాభాకు పెరుగుతున్న అవసరాలను కూడా తీరుస్తుంది. టెర్మినల్ ORR కి సమీపంలో ఉండడం వల్ల మరియు రాబోయే రీజినల్ రింగ్ రోడ్ (RRR) వల్ల ఖచ్చితంగా అన్ని వైపుల ప్రయాణీకులకు సహాయం చేస్తుంది.

Also Read | రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి