Home   »  తెలంగాణ   »   చర్లపల్లి లో కోడి పందాలు

చర్లపల్లి లో కోడి పందాలు

schedule sirisha

హైదరాబాద్: చర్లపల్లి మైదానంలో చాలా రోజుల నుంచి కోడి పందాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (SOT) ఈ రోజు మధ్యాహ్నం అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ.11 వేల నగదు, రెండు పందెం కోళ్ళని, చిన్న కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు చినబాబు (35), వి సుబ్బారావు (50) అనే వ్యక్తులు చర్లపల్లి మైదానంలో కోడి పందాలు నిర్వహిస్తూ చుట్టుపక్కల వారిని కూడా పందాలకు ఆహ్వానించారు. దీంతో సమాచారం అందుకున్న SOT ఘటనా స్థలంపై దాడి చేసి బాబు, రావులను అదుపులోకి తీసుకున్నారు.