Home   »  తెలంగాణ   »   రేపు మహబూబాబాద్‌లో పర్యటించనున్న CM KCR..

రేపు మహబూబాబాద్‌లో పర్యటించనున్న CM KCR..

schedule mounika

మహబూబాబాద్‌: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు(KCR) బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మహబూబాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. అక్టోబర్ 27న మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

బుధవారం శనిగరం రోడ్డు సమీపంలోని బహిరంగ సభ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్‌తో కలిసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. అనంతరం కేసీఆర్ బహిరంగ సభకు జన సమీకరణపై బీఆర్‌ఎస్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. 70 వేల మందికి పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు అని అంచనా వేశారు.

ముఖ్యమంత్రి KCR రాక కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు :సత్యవతి రాథోడ్

ఈ సందర్బంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారన్నారు. ఒక గ్రామంగా ఉన్న మహబూబాబాద్ ను ముఖ్యమంత్రి ఆశీస్సులతో జిల్లాగా ఏర్పాటు చేసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం అన్నారు. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపు ఖాయం అన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకుడు కేసీఆర్, ప్రతిపక్షాల(కాంగ్రెస్‌, బీజేపీ) రోగం కుదిర్చే నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు అధికారం కోసం పుట్టిన పార్టీలు.. పేద ప్రజలకు అండదండగా ఉన్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని అన్నారు. 60ఏండ్ల పాలనలో కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సత్యవతి రాథోడ్

కేంద్రంతో సహా 19రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కొత్తగా ఇక్కడ చేసేదే మీలేదన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్‌, బీజేపీ నైజం. ఆ పార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నరేష్ రెడ్డి, శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి, మర్రి రంగారావు, ఎర్రబెల్లి మాధవి, వీ వాణి శ్రీనివాస్, ఎం శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.