Home   »  తెలంగాణ   »   తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి

schedule mounika

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మెుత్తం 64 స్థానాలతో తెలంగాణలో తొలిసారిగా అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టింది. కాగా, తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా C.M రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ని AICC నియమించింది. అందులో భాగంగానే ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించింది. 

CM Revanth Reddy

ఇక కొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అధిక స్థానాల్లో లోక్‌సభ స్థానాలను గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు సమయాత్తం అవుతోంది. లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రాల వారీగా ఏఐసీసీ ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేసింది.

CM Revanth Reddy | తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలో 25 మందికి చోటు కల్పించిన AICC..

తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా C.M రేవంత్ రెడ్డిని నియమించారు. ఆయనతో పాటు మొత్తం కమిటీలో 25 మందికి చోటు కల్పించింది. అలాగే ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్, ఎన్‌.ఎస్‌.యూ.ఐ, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు కూడా కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది.

కమిటీలోని 25 మంది సభ్యుల వివరాలు..

  1. రేవంత్ రెడ్డి ఛైర్మన్
  2. భట్టి విక్రమార్క మల్లు
  3. తాటిపర్తి జీవన్ రెడ్డి
  4. N. ఉత్తమ్ కుమార్ రెడ్డి
  5. C. దామోదర రాజ నరసింహ
  6. కుందూరు జానా రెడ్డి
  7. వి. హనుమంత రావు
  8. చల్లా వంశీ చంద్ రెడ్డి
  9. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  10. దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  11. పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  12. దనసరి అనసూయ (సీతక్క)
  13. Y.మధు యాష్కీ గౌడ్
  14. S.A. సంపత్ కుమార్
  15. రేణుకా చౌదరి
  16. పోరిక బలరాం నాయక్
  17. జగ్గారెడ్డి
  18. డా. గీతా రెడ్డి
  19. మహ్మద్ అజరుద్దీన్
  20. M. అంజన్ కుమార్ యాదవ్
  21. బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్
  22. మహ్మద్ అలీ షబ్బీర్
  23. ప్రేమ్ సాగర్ రావు
  24. పొడెం వీరయ్య
  25. M. సునీత రావు ముదిరాజ్.

ALSO READ: పారిశ్రామిక అభివృద్ధికి.. మెగా మాస్టర్ ప్లాన్ – 2050