Home   »  తెలంగాణ   »   ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం..

ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం..

schedule mounika

హైదరాబాద్: హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించింది. ఈ క్రిస్మస్ వేడుకలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి హాజరయ్యారు.

CM Revanth Reddy

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సమ్మిళిత ప్రభుత్వాన్ని అందించింది: CM

ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సమ్మిళిత అభివృద్ధిని అందించిందని ముఖ్యమంత్రి A రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ‘అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని’ వ్యాఖ్యానించారు.

అర్హులందరికీ అవకాశం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: CM Revanth Reddy

అర్హులందరికీ అవకాశం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘ప్రజలు తమ మతాలను అనుసరించే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తోందన్నారు. దేశంలో ఎక్కడైనా విచ్చలవిడి ఘటనలు జరిగితే ఆ తప్పును సరిదిద్దుకుని సమాజాన్ని ముందుకు తీసుకెళ్లింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. డిసెంబరును ప్రపంచానికి అద్భుత మాసంగా అభివర్ణించిన CM, అద్భుతం జరగబోతోందన్న విశ్వాసం తనకు ఉందన్నారు.

పాస్టర్లకు గౌరవ వేతనం అందజేస్తాం: CM

ప్రజల కోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ను ఇంతటి ఎత్తుకు తీసుకెళ్లిన బిషప్‌లు, పాస్టర్లు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పాస్టర్లకు గౌరవ వేతనం అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అర్హులైన క్రైస్తవులందరికీ పథకాల ప్రయోజనాలను అందించడం ప్రభుత్వ బాధ్యత అని CM అన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో మువ్వన్నెల జెండాను ఢిల్లీ కోట మీద ఎగురవేయాలి: CM

140 కోట్ల మంది ప్రజలు శాంతియుతంగా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ జీవించాలన్నారు.అందరినీ సమానంగా భావించే ప్రభుత్వం రావాలని, లౌకిక ప్రభుత్వం ఉంటేనే ప్రజలు సురక్షితంగా ఉంటారని అన్నారు. ఈ దేశంలో సర్వమత సమ్మేళనం శాంతియుతంగా ముందుకు సాగాలంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మువ్వన్నెల జెండాను ఢిల్లీ కోట మీద ఎగురవేయాలన్నారు.

కాగా, దేశంలో రక్షణ వ్యవస్థపై అనేక అనుమానాలున్నాయని దీనికి ఉదాహరణ మణిపూర్ లో జరిగిన ఘటనలే నిదర్శనమన్నారు. మా అధినేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించి బాధిత ప్రజలతో మాట్లాడి శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించారన్నారు.

దేశంలో శాంతి భద్రతల దిశగా ప్రతి ఒక్క పౌరుడు అడుగులు వేయాలి : CM

ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ప్రజలను రక్షించడానికి ప్రయత్నించలేదన్నారు. దేశంలో శాంతి భద్రతల దిశగా ప్రతి ఒక్క పౌరుడు అడుగులు వేయాలని అందుకు బిషప్‌‎లు ఆశీర్వదించాలని కోరారు. తమ ప్రభుత్వంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ALSO READ: క్రిస్మస్ వేడుకల కారణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు…