Home   »  తెలంగాణ   »   గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు నేడే శ్రీకారం..

గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు నేడే శ్రీకారం..

schedule mahesh
cm-revanth-will-launch-mahalakshmi-scheme-today

Mahalakshmi scheme | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడంలో భాగంగా, నేడు మరో రెండు హామీలను అమలు చేసేందుకు సిద్ధమైంది.

గృహజ్యోతి, Mahalakshmi schemeను ప్రారభించనున్న సీఎం

సోమవారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఈరోజు (27-02-2024) సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ రెండు హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్

ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెల్ల రేషన్‌కార్డులు ఉన్న వారికి గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. మొదట్లో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ నాయకులు ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె హాజరుకావడం లేదు.

ఆరు హామీల అమలును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి మహిళలను పెద్దఎత్తున కార్యక్రమం వద్దకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది.

Also Read | ప్రియాంక గాంధీ చేవెళ్ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు..!